KTR Speech In Nizamabad: రేవంత్ రెడ్డిపై ప్రాసలతో సెటైర్లు వేసిన మంత్రి కేటీఆర్

KTR Speech In Nizamabad Meeting : ఇదే సభా వేదికపై నుంచి తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డిని సైతం ఏకిపారేశారు. అతనొక థర్డ్‌ క్లాస్‌ క్రిమినల్ అంటూ రేవంత్ రెడ్డి వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వ్యక్తితో మనం తలపడాల్సి వస్తోంది అంటూ రేవంత్ రెడ్డిని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. 

Written by - Pavan | Last Updated : Aug 10, 2023, 06:27 AM IST
KTR Speech In Nizamabad: రేవంత్ రెడ్డిపై ప్రాసలతో సెటైర్లు వేసిన మంత్రి కేటీఆర్

KTR Speech In Nizamabad Meeting : ఇందూరు వేదికగా జరిగిన సభలో మంత్రి కేటీఆర్ బీజేపీ, కాంగ్రెస్ నాయకత్వంతో చెడుగుడు ఆడుకున్నారు. మొదట లోకల్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ను టార్గెట్ చేసిన కేటీఆర్... ఇక్కడి ఎంపీకి అసలు చదువే రాదన్నారు. అతనో కుసంస్కారి అంటూ ఎంపీ వ్యక్తిత్వాన్ని డస్ట్ బిన్‌లో పడేశారు. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ మీద విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ జన్ దన్‌ ఖాతా తెరవమన్నారు. జన్ ధన్ ఖాతా ఉన్న ప్రతీ ఒక్కరి ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు జమ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ప్రధాని మోదీ ఆ ఎన్నికల హామీని నెరవేర్చకుండా మోసం చేశారని ఆరోపించారు. మతం చిచ్చు రేపి వీరంతా చలిమంటలు కాచుకుంటారని ఘాటుగా స్పందించారు.

ఇదే సభా వేదికపై నుంచి తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డిని సైతం ఏకిపారేశారు. అతనొక థర్డ్‌ క్లాస్‌ క్రిమినల్ అంటూ రేవంత్ రెడ్డి వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వ్యక్తితో మనం తలపడాల్సి వస్తోంది అంటూ రేవంత్ రెడ్డిని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. అంతో ఇంతో కాంగ్రెస్‌ పార్టీకి గాలి వీస్తోందని అనుకుంటున్న తరుణంలోనూ రేవంత్‌ రెడ్డికి పీసీసీ చీఫ్‌ పోస్ట్ ఇవ్వడం చూస్తేనే ఆ పార్టీ ఎంతటి దౌర్బాగ్య స్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చని కాంగ్రెస్ పార్టీని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ ఒక సంచలన నాయకుడైతే… రేవంత్‌ రెడ్డి సంచులు మోసే నాయకుడంటూ ప్రాసలతో వ్యంగ్యాస్త్రాలు సంధించి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.. మూడు గంటల కరెంటు చాలని తన మనసులోని మాట బయటపెట్టాడని రేవంత్ రెడ్డి మంత్రి కేటీఆర్‌ తూర్పారబట్టారు.

ఇది కూడా చదవండి : Kavitha Absent for KTR Meeting: నిజామాబాద్‌లో కేటీఆర్ మీటింగ్‌కి కవిత డుమ్మాపై పబ్లిక్ టాక్

రైతులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే 3 గంటల కరెంటు కావాల్నా ? లేక మూడు పంటలు వేసుకునేలా కరెంట్ ఇచ్చే సీఎం కేసీఆర్‌ కావాల్నా అనేది రైతులే ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చిందని అన్నారు. మతం మంటల వేడిలో చలి కాచుకునే బీజేపీ కావాల్నా ? అని ప్రజలనుద్దేశించి మాట్లాడుతు వచ్చే ఎన్నికల్లో జనం కేసీఆర్‌కు మద్దతు తెలపాలని కోరారు. గుడుల మీద, మసీదుల మీద దాడులు చేసుకుంటూ మతం చిచ్చురేపి చలిమంటలు కాచుకునే బీజేపీ కావాల్నా ? లేక కుంభకోణాల కాంగ్రెస్‌ పార్టీ కావాల్నో జనమే తేల్చుకోవాలి అంటూ బీజేపి, కాంగ్రెస్ పార్టీల వైఖరిపై మంత్రి కేటీఆర్‌ దుమ్మెత్తిపోశారు. ఇది కూడా చదవండి : Baby Boy And Baby Girl Exchanged: మహబూబాబాద్ ప్రభుత్వాసుపత్రిలో చిన్న పిల్లల తారుమారు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News