KTR Review Meeting On Double Bedroom House Distribution: స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ముఖ్యమంత్రి చేసిన ప్రకటన నేపథ్యంలో పంపిణీ ప్రక్రియను జీహెచ్ఎంసీ మరింత వేగవంతం చేసింది. జీహెచ్ఎంసీ నగర పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ ప్రక్రియపై మంత్రి కేటీఆర్ ప్రగతి భవన్‌లో బుధవారం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, మల్లారెడ్డి డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్‌లు, జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇప్పటికే 70 వేల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకుని పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని.. అర్హులైన లబ్ధిదారులకు అందించే కార్యక్రమం వేగంగా నడుస్తుందని అధికారులు మంత్రులకు చెప్పారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల వెరిఫికేషన్ పక్రియ కూడా దాదాపు పూర్తి కావచ్చిందన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలంగాణ ప్రభుత్వం జీహెచ్ఎంసీలో లక్ష ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకొని వాటిని వేగంగా పూర్తి చేస్తుందని చెప్పారు. ఇప్పటికే 75 వేలకు పైగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పంపిణీ పూర్తి అయిందన్నారు. ఇందులో సుమారు 4500కు పైగా ఇళ్లను ఇనిస్టిట్యూట్ లబ్ధిదారులకు అందించామని తెలిపారు. నిర్మాణం పూర్తి చేసుకొని పంపిణీకి సిద్ధంగా ఉన్న సూమారు 70 వేల ఇళ్లను 5 లేదా 6 దశల్లో వేగంగా అందిస్తామని తెలిపారు.
వచ్చే వారంలోనే తొలి దశ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ ప్రక్రియ ప్రారంభమవుతుందని మంత్రి చెప్పారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తిచేయాలని జీహెచ్ఎంసీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రక్రియ పంపిణీపై మంత్రులు పలు సూచనలను తెలియజేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీకి సంబంధించి నగర ప్రజలు ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నారని తెలిపారు.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారుల గుర్తింపులో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదని పూర్తిగా అధికార యంత్రాంగమే క్షేత్రస్థాయి పరిశీలన కూడా పూర్తిచేసి అర్హులను గుర్తిస్తుందన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం గుర్తించిన లబ్ధిదారులందరినీ వాటి కేటాయించనున్న ఇండ్ల వద్దనే అప్పజెప్పేలా పంపిణీ కార్యక్రమం ఉండాలన్నారు. గృహలక్ష్మి పథకానికి సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక, పథకాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకువెళ్లే విషయాన్ని కూడా మంత్రుల సమావేశంలో చర్చించారు.
Also Read: AP Politics: వచ్చే ఎన్నికల్లో పోటీపై బాలినేని ప్రకటన.. జగన్ గ్రీన్‌సిగ్నల్ ఇస్తారా..?
Also Read: Shilpa Shetty: చెప్పులు ధరించి జాతీయ జెండాను ఎగురవేసిన శిల్పాశెట్టి.. నెట్టింట ట్రోలింగ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook