Double Bedroom Houses Distribution: జీహెచ్ఎంసీ హైదరాబాద్ నగరంలో కట్టిన లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల విలువ రూ.9700 వేల కోట్లపైనే ఉంటుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. కానీ తాము కట్టిన ఈ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల మార్కెట్ విలువ రూ.50 నుంచి 60 వేల కోట్ల రూపాయలు ఉంటుందని చెప్పారు. కుత్బుల్లాపూర్, దుండిగల్‌లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ, ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఒక్క రూపాయి లంచం ఇవ్వాల్సిన అవసరం లేకుండా.. ఎవరి ప్రమేయం లేకుండా లబ్ధిదారులకు ఉచితంగా అందిస్తున్నామన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికను అత్యంత పారదర్శకంగా కంప్యూటర్ ప్రోగ్రామ్ ఆధారంగా పూర్తి చేసినట్లు తెలిపారు.
లబ్ధిదారుల ఎంపికలో ప్రజాప్రతినిధుల పాత్ర లేదు. పేదలకి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అందితే చాలు అన్న కేసీఆర్ గారి మార్గదర్శనం మేరకు పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేశాం.. లబ్ధిదారుల జాబితాలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు కూడా ఉన్నారు. ఈ రోజు 8 చోట్ల 13 వేలకు పైగా ఇండ్లను ఒక్కరోజే లబ్ధిదారులకు అందిస్తున్నాం. ఈరోజు జరిగిన ఇండ్ల పంపిణీ కార్యక్రమంతో దాదాపు 30 వేల ఇండ్లు లబ్ధిదారులకు అందించాం. మిగిలిన 70 వేల ఇళ్లను కూడా త్వరలో లబ్ధిదారులకు అందిస్తాం. ఒక్క లబ్ధిదారుడైన ఒక్క రూపాయి లంచం ఇచ్చే పరిస్థితి ఉంటే నేరుగా అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ చెప్పాలి.
మన దేశంలో ఇంకా ఎక్కడైనా ఇంత పెద్ద పక్క డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టి పేదలకు ఇస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందా..? పేదలకు ఉచితంగా ఇండ్లు కట్టించి ఇస్తున్న బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో అయినా ఉందా..? దేశంలోనే అతిపెద్ద మురికివాడల అభివృద్ధి కార్యక్రమంగా ఈ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం నిలుస్తుంది. ఇంత పెద్ద డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్న జీహెచ్ఎంసీ అధికారులకు అభినందనలు. కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే పేదలకు న్యాయం జరుగుతోంది. వారి జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయి. పేదలపైన, రైతులపైన కేసీఆర్ కన్నా అత్యంత ప్రేమ కలిగిన నాయకుడు దేశంలో ఎవరూ లేరు.." అని మంత్రి కేటీఆర్ అన్నారు.
పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ప్రజలను ఆయన కోరారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి అందించలేని కొన్ని పార్టీలు ఈరోజు అడ్డగోలు వాగ్దానాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఢిల్లీ నుంచి, బెంగళూరు నుంచి వచ్చి అడ్డగోలు వాగ్దానాలు చేస్తున్న వారి మాటలు నమ్మాల్సిన అవసరం లేదన్నారు. సంక్రాంతికి ముందు గంగిరెద్దులు వచ్చినట్లు ఎన్నికల ముందు వచ్చి బూటకపు హామీలు ఇచ్చే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు.
Also Read: Emergency Alert Message: మీ మొబైల్‌కు ఇలాంటి మెసేజ్ వచ్చిందా..? అసలు విషయం ఇదే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook