GHMC Elections | రానున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి విజయం సాధిస్తుంది అని తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇవాళ తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో మంత్రి కేటీఆర్ పాత్రికేయులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన గత 6 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ నగారానికి ఏం చేసిందో చెప్పమన్నారు.
Also Read | TRS Manifesto: టీఆర్ఎస్ హెచ్ఎంసీ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల, కీలక అంశాలివే
లోయర్ సీలేరును ఆంధ్రప్రదేశ్ లో కలిపింది భాజపా అని.. దేశంలో బీజేపికి ముస్లింలపై ఎంత ధ్వేషం ఉందో అందరికీ తెలుసన్నారు కేటీఆర్ ( KTR ). తను పేకాట క్లబ్బులు మూసివేసినందుకు తనపై బీజేపీ చార్జీ షీటు వేస్తుందా అని నిలదీశారు. దేశ వ్యప్తంగా చిరు వ్యాపారులు బీజేపీ వల్ల నష్టపోయారు అని తెలిపారు కేటీఆర్
కోవిడ్-19 ( Covid-19 ) సమయంలో లాక్ డౌన్ వల్ల చనిపోయిన వలస కార్మికుల అత్మలు చార్జిషీట్ వేయాలని ఆయన కామెంట్ చేశారు. ఇక పెట్టుబడులు ఉపసంహరణ అనేది దేశం కోసమా లేదా గుజరాత్ కోసమా అని నిలదీశారు. ఈసారి తప్పుకుండా తెలంగాణ రాష్ట్ర సమితీ పార్టీ గెలుస్తుంది అని.. తరువాత స్థానంల్ ఎంఐఎం ఉంటుంది అని అన్నారు కేటీఆర్
Also Read | GHMC Elections: హైదరాబాద్ నగరాన్ని కాంగ్రెస్ పార్టీనే అభివృద్ధి చేసింది- ఉత్తమ్
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR
GHMC Elections 2020: గ్రేటర్ ఎన్నికల్లో గెలుపుమాదే-KTR