Harish Rao Letter: మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేయొద్దు.. కేంద్రానికి హరీష్ రావు లేఖ

Harish Rao Letter To Rajnath Singh: మెదక్ సహా ఇతర ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను ప్రైవేట్ పరం చేయొద్దంటూ కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. ప్రైవేట్ పరం చేస్తే.. దాదాపు 25 వేల మంది భవిష్యత్ అంధకారంలో పడుతుందని అన్నారు.

Written by - Ashok Krindinti | Last Updated : Apr 22, 2023, 12:43 PM IST
Harish Rao Letter: మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేయొద్దు.. కేంద్రానికి హరీష్ రావు లేఖ

Harish Rao Letter To Rajnath Singh: దేశ రక్షణ రంగంలో మెదక్ సహా ఇతర ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు కీలక పాత్ర పోషిస్తున్నాయని.. వీటిని ప్రైవేట్ పరం చేయవద్దని కేంద్రాన్ని మంత్రి హరీష్ రావు కోరారు. ఈ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌కు లేఖ రాశారు. దేశ భద్రత, 74 వేల మంది ఉద్యోగులను దృష్టిలో ఉంచుకొని వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. డిఫెన్స్ రంగంలో ఉన్న 7 ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తే.. ఆయా సంస్థల మధ్య పోటీ నెలకొంటుందని లేఖలో ప్రస్తావించారు హరీష్ రావు. దీంతో నూతన ఆయుధాల అభివృద్ధి నిలిచిపోతుందని.. ఇది మేకిన్ ఇండియా స్ఫూర్తిని దెబ్బతీస్తుందని అన్నారు.

గత ఆర్థిక సంవత్సరంలో మెదక్‌లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి, సిబ్బందికి కావాల్సినంత పని ఉండేదని మంత్రి హరీష్ రావు అన్నారు. దాదాపు రూ.930 కోట్ల ఆర్డర్లను సమయానికి పూర్తిచేశారని లేఖలో గుర్తు చేశారు. ఎలాంటి సవాళ్లనైనా స్వీకరించేందుకు సంస్థ సిబ్బంది సిద్ధంగా ఉన్నారని.. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో సంస్థకు పెద్దగా పని అప్పగించలేదని ప్రస్తావించారు. దీనిని కారణగా చూపుతూ.. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని సిక్ ఇండస్ట్రీగా ప్రకటిస్తారని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఇదే జరిగితే ప్రత్యక్షంగా 2500 మంది ఉద్యోగులు, పరోక్షంగా 5 వేల మంది ఉపాధి దెబ్బతింటుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 25 వేల మంది భవిష్యత్తు అంధకారంలో పడుతుందన్నారు. 

ఆయుధ కర్మాగార తెలంగాణ ఉద్యోగుల సమాఖ్య ప్రతినిధులు తన దగ్గరికి వచ్చి ప్రైవేటైజేషన్‌ను అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారని లేఖలో పేర్కొన్నారు హరీష్ రావు. ప్రధానంగా లేఖలో ఆరు డిమాండ్లను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ డిమాండ్లను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు.

Also Read: Repo Rate 2023: లోన్లు తీసుకున్న వారికి గుడ్‌న్యూస్.. త్వరలో వడ్డీ రేట్లు తగ్గింపు..!   

==> మూడు రైతు చట్టాల మాదిరిగానే డిఫెన్స్ రంగా సంస్థల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి
==> పరిశోధనల విభాగాన్ని మరింత పటిష్టం చేయాలి. 
==> మిషనరీని ఆధునికీకరించాలి. ఉద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలి.
==> పరిపాలన, కొనుగోలు విధానాలను సరళీకరించాలి.
==> ఆర్మీ అవసరాలకు అనుగుణంగా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి ఆర్డర్లు ఇవ్వాలి. 
==> ప్రసార భారతిలో మాదిరిగానే ఉద్యోగులకు భద్రత కల్పించాలి.

Also Read: LSG vs GT Dream11 Tips: గుజరాత్ టైటాన్స్‌తో లక్నో ఢీ.. డ్రీమ్ 11 టీమ్ టిప్స్ మీకోసం..   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News