Telangana Diagnostic Centers: తెలంగాణ ప్రభుత్వం వైద్యరంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ప్రభుత్వ హాస్పిటళ్లలోనూ కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే లక్ష్యంగా సర్కార్ పనిచేస్తోంది. ఇప్పటికే నగరంలో పెద్దెత్తున ప్రారంభమైన బస్తీ దవాఖానాలతో పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందుతోంది. రాష్ట్రంలో నూతనంగా 9 తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసింది. అందులోభాగంగా రంగారెడ్డి జిల్లా నార్సింగిలో పర్యటించిన మంత్రి హరీశ్ రావు టీ డయాగ్నోస్టిక్ మినీ హాబ్ ను ప్రారంభించారు. అనంతరం మొబైల్ యాప్ ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, పాల్గొన్నారు. అటు రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని బుద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ ను చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ప్రారంభించారు. మల్కాజ్‌గిరి నియోజకవర్గంలోని అల్వాల్ పీహెచ్‌సీలో ఏర్పాటుచేసిన తెలంగాణ డయాగ్నొస్టిక్స్ ను ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. వైద్యారోగ్యశాఖకు సీఎం కేసీఆర్ బడ్జెట్ ను డబుల్ చేశారని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులకు కొరత లేదన్నారు. ఒకవేళ డాక్టర్ మందుల చిటీని బయటకు రాస్తే డాక్టర్ బయటకు పోవాల్సిందేనని హెచ్చరించారు. వైద్యారోగ్యశాఖలో త్వరలోనే 13 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. ఇందుకు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ కూడా ఇస్తామని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. గాంధీతో పాటు నిమ్స్ ఆసుపత్రిలో 200 పడకలతో ఎంసీహెచ్ దవాఖానాలు నిర్మిస్తామని చెప్పారు.
పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే సీఎం కేసీఆర్ 350కిపైగా బస్తీ దవాఖానాలను ప్రారంభించారని మంత్రి హరీశ్ రావు తెలిపారు. తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్లలో అధునాతర పరికరాలు అందుబాటులో ఉన్నాయన్నారు. 20 రేడియాలజీ ల్యాబ్ లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చామని హరీశ్ రావు తెలిపారు. టీ డయాగ్నోస్టిక్ సెంటర్‌లలో ఎక్స్‌రే, 2 డీ ఎకో, అల్ట్రా సౌండ్, ఈసీజీ లాంటి పరీక్షలు కూడా చేస్తారని చెప్పారు. ప్రస్తుతం బస్తీ దవాఖానాల్లో 57 రకాల పరీక్షలు చేస్తున్నారని.. త్వరలోనే వాటి సంఖ్యను 134 కు పెంచుతామన్నారు. మొబైల్ యాప్ లో పాత రికార్డులను కూడా చూసుకోవచ్చన్నారు. ఈ యాప్ లోనే గ్రీవెన్స్ సెల్ కూడా ఏర్పాటు చేశామన్నారు. హైదరాబాద్ నగరంలో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణాలు జరుగుతున్నాయని మంత్రి హరీశ్ రావు చెప్పారు. గచ్చిబౌలి టిమ్స్ ను రీ మోడల్ చేస్తున్నామన్నారు. నిమ్స్ లో ఇప్పుడున్న 1400 పడకలను.. త్వరలోనే 2వేలకు పెంచుతామని చెప్పారు.
Also Read:Mehabooba Song Video: కేజీఎఫ్ 2 రొమాంటిక్ సాంగ్ మెహబూబా వీడియో వచ్చేసింది!
Also Read:KGF 2 Records & OTT: కేజీఎఫ్ ఛాప్టర్ 2 మరో రికార్డు.. ఓటీటీలో ఎప్పుడో తెలుసా..??
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.