Minor Gril Gang Rape: తెలంగాణలో ప్రకంపనలు రేపుతున్న మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ ఘటనపై హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. మైనర్ బాలికపై అత్యాచారం చేయడం బాధాకరమన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న అసద్.. నిందితులను కఠినంగా శిక్షించాలని అన్నారు. గ్యాంగ్ రేప్ కేసులో ఎంఐఎం నేతల పిల్లలే నిందితులుగా ఉన్నారు. ఎంఐఎం ఎమ్మెల్యే సోదరుడి కొడుకు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఎమ్మెల్యే కొడుకు కూడా గ్యాంగ్ రేప్ ఘటనలో ఉన్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ ఘటన జరిగిన వారం రోజులు అవుతున్నా.. అసదుద్దీన్ ఒవైసీ స్పందించలేదు. దేశంలో ఎక్కడా ఏ చిన్న ఘటన జరిగినా వెంటనే స్పందించే అసద్.. తన నియోజకవర్గంలో జరిగిన ఘటనపై ఎందుకు స్పందించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. హైదరాబాద్ ఎంపీ మిస్సింగ్ అంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎంపీ అసద్ స్పందించారు.
తెలంగాణలో తీవ్ర కలకలం రేపిన మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో పోలీసుల విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో ఇప్పటివరకు నలుగురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. నాలుగో నిందితుడిని కర్ణాటకలోని గుల్బార్గాలో పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులతో పాటు మైనర్ బాలిక కారులో నిందితులతో కలిసి ప్రయాణించిన వీడియోలను వైరల్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పాతబస్తీకి చెందిన మీడియా ప్రతినిధి సుభానీ.. ఈ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటివరకు పట్టుబడిన వారంతా రాజకీయ నేతల పిల్లలే. వక్ఫ్ బోర్డు చైర్మెన్ కొడుకు, జీహెచ్ఎంసీ కార్పొరేటర్ కుమారుడు, ఎంఐఎం నేత తనయుడు, సంగారెడ్డి టీఆర్ఎస్ నేత కుమారుడు అరెస్ట్ అయ్యారు. ఎంఐఎం ఎమ్మెల్యే సోదరుడి కొడుకు ఉమేర్ ఖాన్ ను నిందితుడిగా చేర్చిన పోలీసులు.. అతని కోసం గాలిస్తున్నారు. బెంజీ కారులో ఉన్న వీడియోలో ఎమ్మెల్యే కొడుకు ఉండటంతో... లీగల్ ఒపినీయన్ తీసుకుంటున్నారు. అతనిని కేసులో ఆరవ నిందితుడిగా చేర్చబోతున్నారని తెలుస్తోంది.
Read also: Ka Paul Comments: అలా జరిగితే నేనే పీఎం..పవన్ సీఎం..కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook