Woman Assaulted by Gang: కూలీ పని చేసుకునే మహిళపై కన్నేశారు.. పనికి వెళ్తుండగా అడ్డగించారు..

Woman Assaulted by Gang: దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతిపై గ్యాంగ్ రేప్ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఉపాధికోసం వచ్చిన మహిళను ఖాళీ ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నిస్తుండగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 30, 2022, 05:00 PM IST
  • సోలాపూర్ నుండి హైదరాబాద్‌కు వలస వచ్చిన మహిళ
  • పని కోసం హైదరాబాద్ వచ్చిన మహిళపై దారుణం
  • బాధితురాలిని వైద్య పరీక్షలకు పంపించిన పోలీసులు
Woman Assaulted by Gang: కూలీ పని చేసుకునే మహిళపై కన్నేశారు.. పనికి వెళ్తుండగా అడ్డగించారు..

Woman Assaulted by Gang: దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతిపై గ్యాంగ్ రేప్ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఉపాధికోసం వచ్చిన మహిళను ఖాళీ ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నిస్తుండగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. దుండిగల్ ఇన్స్‌పెక్టర్ రమణా రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఓ యువతి (30) ఉపాధి కోసం సోలాపూర్ నుండి గండి మైసమ్మకు వలస వచ్చింది. పనికోసం వెళ్తున్న సమయంలో ఆటో డ్రైవర్ ఇమామ్ మాయ మాటలు చెప్పి ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోఉన్న ఉజ్వల బార్ వెనకాల ఉన్న నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లి లైంగికదాడికి ప్రయత్నించాడు. అదే సమయంలో అక్కడకు మరికొంత మంది యువకులు కుద్దుస్, ఉమృద్దీన్, నర్సింహలు వచ్చి వారు కూడా ఆ యువతితో అసభ్యంగా ప్రవర్తించసాగారు. 

ఈ క్రమంలో ఆ యువతి వారితో గొడవ పడటాన్ని గమనించిన స్థానికులు డయల్ 100 కి సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆ యువకులను పోలీస్ స్టేషన్‌కి తరలించారు. అయితే ఆ యువతి పొంతన లేని సమాధానాలు చెబుతుందని, మొదట సామూహిక లైంగిక దాడి (Gang rape) చేశారని, తరువాత చేయలేదని సమాధానం చెప్పడంతో బాధితురాలిని వైద్య పరీక్షలకు పంపించామని పోలీసులు తెలిపారు. రిపోర్ట్ వచ్చిన తరువాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామని సిఐ రమణా రెడ్డి వెల్లడించారు.

Also read : Rahul Gandhi Meeting: ఓయూలో రాహుల్‌సభ- కీలక నిర్ణయం..!

Also read : Balka Suman VS Jagga Reddy : పోశమ్మ గుడిలో పొట్టేలులా జగ్గారెడ్డి! మళ్లీ రెచ్చిపోయిన బాల్క సుమన్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News