Chiranjeevi Gaddar Awards: తెలుగు సినీ పరిశ్రమపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడం.. అసంతృప్తి వ్యక్తం చేయడంతో తెలుగు సినీ పరిశ్రమ నుంచి తొలి స్పందన లభించింది. నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు ఏర్పాటుచేయడంపై సినీ పరిశ్రమ స్పందించకపోవడంపై నిరసించడంతో తాజాగా మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. గద్దర్ అవార్డులపై ముందుకు వెళ్తామని.. ఈ సందర్భంగా తెలుగు ఫిల్మ్ చాంబర్, తెలుగు నిర్మాతల మండలికి చిరంజీవికి ఆదేశాలు జారీ చేశారు. ఎక్స్ వేదికగా (ట్విటర్) చిరంజీవి కీలక ట్వీట్ చేశారు. అంతేకాకుండా గతంలో ఓ సభలో మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోను పంచుకున్నారు.
Also Read: Revanth vs Tollywood: నా మాటలకే స్పందన ఇవ్వరా? సినీ పరిశ్రమపై మళ్లీ రేవంత్ రెడ్డి అసంతృప్తి
'తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ తీసుకుని సినిమా అవార్డులను పునరుద్ధరిస్తూ.. సినీ పరిశ్రమలోని ప్రతిభావంతులకు ప్రజా కళాకారుడు గద్దర్ పేరు మీదుగా ప్రతియేటా 'గద్దర్ అవార్డ్స్' \తెలంగాణ ప్రభుత్వం ఇస్తోంది. ఈ ప్రతిపాదనను ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకువెళ్లేలా తెలుగు పరిశ్రమ తరపున, ఫిలిం ఛాంబర్, నిర్మాతల మండలి బాధ్యత తీసుకోవాలని కోరుతున్నా' అంటూ చిరంజీవి పోస్టు చేశారు.
Also Read: Telangana Assembly: అసెంబ్లీలో ఆసక్తికర చర్చ.. రేవంత్ రెడ్డి సీటుకు ఎసరు పెట్టిన కోమటిరెడ్డి
ఈ సందర్భంగా తనకు పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న సందర్భంగా నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోను చిరంజీవి పంచుకున్నారు. ఆ వీడియోలో గద్దర్ అవార్డుల ప్రతిపాదనను స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు. నంది అవార్డుల స్థానంలో ప్రజా కళాకారుడు గద్దర్ పేరిట అవార్డులు ఇవ్వడాన్ని స్వాగతించారు. ఇప్పుడు ఆ అవార్డుల ప్రతిపాదనను మరింత ముందుకు వెళ్లేందుకు చిరంజీవి చొరవ చూపారు.
ఏం జరిగింది?
ఈ ఏడాది జనవరిలో చిరంజీవితోపాటు పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. ఆ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు ప్రకటిస్తామని తెలిపారు. నాడు రేవంత్ రెడ్డి గద్దర్ అవార్డుల కార్యక్రమాన్ని ఎలా సమర్థవంతంగా అమలు చేయాలనే దానిపై అభిప్రాయాలు, సూచనలు అందించాలని తెలుగు చిత్ర పరిశ్రమను కోరారు. అయితే చిత్ర పరిశ్రమ నుంచి స్పందన రాకపోవడంతో తాజాగా ఓ సభలో రేవంత్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
'సినీ పరిశ్రమ మౌనంగా ఉంది. తెలుగు చిత్ర పరిశ్రమలో చేసిన కృషికి, విజయాలకు గౌరవంగా గద్దర్ అవార్డులను ప్రకటించాం. సినీ పరిశ్రమ పెద్దల నుంచి ఎలాంటి స్పందన లేకపోవటం బాధాకరం' అంటూ రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి అసంతృప్తి ఇప్పటికైనా చిత్ర పరిశ్రమ నుంచి స్పందన వస్తుందో చూడాలి. అయితే గద్దర్ అవార్డుల విషయంలో చిరంజీవి చొరవ తీసుకునే అవకాశం ఉంది.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి
శ్రీ రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకుని,
సినిమా అవార్డులను పునరుద్ధరిస్తూ
సినీపరిశ్రమలోని ప్రతిభావంతులకు,
ప్రజా కళాకారుడు గద్దర్ గారి పేరు మీదుగా ప్రతియేటా 'గద్దర్ అవార్డ్స్'
తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందని
ప్రకటించిన తరువాత, తెలుగు పరిశ్రమ తరపున,… pic.twitter.com/vpOuec2T5H— Chiranjeevi Konidela (@KChiruTweets) July 30, 2024
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter