Secunderabad Club Fire Accident: సికింద్రాబాద్ క్లబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. రూ.20 కోట్ల ఆస్తి నష్టం

Secunderabad Club Fire Accident: దేశంలోని ప్రతిష్ఠాత్మక క్లబ్బుల్లో ఒకటైన సికింద్రాబాద్ క్లబ్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆదివారం (జనవరి 16) తెల్లవారుజామున 3 గం. సమయంలో క్లబ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 16, 2022, 01:11 PM IST
  • సికింద్రాబాద్ క్లబ్‌లో భారీ అగ్ని ప్రమాదం
  • తెల్లవారుజామున 3గం. సమయంలో క్లబ్‌లో ఒక్కసారిగా మంటలు
  • సుమారు రూ.20 కోట్లు మేర ఆస్తి నష్టం
Secunderabad Club Fire Accident: సికింద్రాబాద్ క్లబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. రూ.20 కోట్ల ఆస్తి నష్టం

Secunderabad Club Fire Accident: దేశంలోని ప్రతిష్ఠాత్మక క్లబ్బుల్లో ఒకటైన సికింద్రాబాద్ క్లబ్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆదివారం (జనవరి 16) తెల్లవారుజామున 3గం. సమయంలో క్లబ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు క్లబ్ మొత్తం వ్యాపించడంతో... భవనం పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు.

10 ఫైరింజన్లు దాదాపు నాలుగైదు గంటలుగా మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు శ్రమిస్తున్నాయి. ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించి  మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు. మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చే ఇంకా చాలా సమయం పట్టవచ్చునని చెబుతున్నారు. అగ్ని ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించినప్పటికీ సుమారు రూ.20 కోట్లు మేర ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం. శనివారం (జనవరి 15) సంక్రాంతి పండగ కావడంతో క్లబ్‌ను మూసివేసినట్లు తెలుస్తోంది. దీంతో పెను ముప్పు తప్పిందంటున్నారు. సికింద్రాబాద్ క్లబ్ జూబ్లీ బస్టాండ్‌కు దగ్గరగా ఉండటంతో.. ప్రస్తుతం అక్కడ వాహనాల రాకపోకలు నిలిపివేసినట్లు సమాచారం. అల్వాల్, బొల్లారం, శామీర్‌పేట్ వైపు వెళ్లే వాహనాలను దారి మళ్లిస్తున్నట్లు తెలుస్తోంది.

దేశంలోని ఐదు పురాతన క్లబ్బుల్లో సికింద్రాబాద్ క్లబ్ (Hyderabad) ఒకటి. ఏప్రిల్ 26, 1878న బ్రిటీష్ ఆర్మీ గ్యారిసన్స్ దీన్ని స్థాపించారు. దాదాపు 21 ఎకరాల్లో ఈ క్లబ్ విస్తరించి ఉంది. అప్పట్లో సికింద్రాబాద్ గ్యారిసన్ క్లబ్, సికింద్రాబాద్ జింఖానా క్లబ్, యునైటెడ్ సర్వీసెస్ క్లబ్‌... ఇలా రకరకాల పేర్లు మార్చారు. చివరకు 'సికింద్రాబాద్ క్లబ్' పేరునే కొనసాగించారు.  ఈ క్లబ్‌లో మొదట్లో బ్రిటీష్ ప్రెసిడెంట్స్ మాత్రమే మెంబర్స్‌గా ఉండేవారు. ఆ తర్వాత పలువురు అత్యున్నత స్థాయి అధికారులకు మెంబర్‌షిప్ అవకాశం కల్పించారు. ప్రస్తుతం క్లబ్‌లో 5వేల మందికి పైగా సభ్యత్వం ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 300 మంది సిబ్బంది ఇక్కడ పనిచేస్తున్నారు.

క్లబ్ దగ్ధంపై అనుమానాలు :

సికింద్రాబాద్ క్లబ్ దగ్ధంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. శనివారం అర్ధరాత్రి సమయం వరకు నగరంలో భారీ వర్షం కురిసింది. ఆ తర్వాత సికింద్రాబాద్ క్లబ్‌లో మంటలు ఎలా వ్యాపించాయన్నది మిస్టరీగా మారింది.

Also Read: Virat Kohli: విరాట్ కోహ్లీ ఆ ధ్యాసలో పడి.. మ్యాచ్‌ గురించి మర్చిపోయాడు: డీన్ ఎల్గర్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News