Hyderabad Floods: చిన్నపాటి వర్షానికే జామ్...రోడ్డుపై ఈదుతూ వెళ్లిన వ్యక్తి

Hyderabad Rains: వరుణుడి ప్రకోపానికి భాగ్యనగరం ( Hyderabad ) అతలాకుతలం అవుతోంది. భారీ వర్షాల తరువాత వచ్చిన వరదల వల్ల జనజీవనం అస్థవ్యస్తం అయింది. చాలా చోట్ల నిన్నా మొన్నటి పరిస్థితే కనిపిస్తోంది. వీధుల్లోకి వచ్చి చేరిన నీరు ఇంకడానికి చోటు లేక అనేక చోట్ల నిలిచిపోయింది.

Last Updated : Oct 17, 2020, 10:17 PM IST
    • వరుణుడి ప్రకోపానికి భాగ్యనగరం అతలాకుతలం అవుతోంది.
    • భారీ వర్షాల తరువాత వచ్చిన వరదల వల్ల జనజీవనం అస్థవ్యస్తం అయింది.
    • చాలా చోట్ల నిన్నా మొన్నటి పరిస్థితే కనిపిస్తోంది.
Hyderabad Floods: చిన్నపాటి వర్షానికే జామ్...రోడ్డుపై ఈదుతూ వెళ్లిన వ్యక్తి

Hyderabad Rains: వరణుడి ప్రకోపానికి భాగ్యనగరం ( Hyderabad ) అతలాకుతలం అవుతోంది. భారీ వర్షాల తరువాత వచ్చిన వరదల ( Hyderabad Floods) వల్ల జనజీవనం అస్థవ్యస్తం అయింది. చాలా చోట్ల నిన్నా మొన్నటి పరిస్థితే కనిపిస్తోంది. వీధుల్లోకి వచ్చి చేరిన నీరు ఇంకడానికి చోటు లేక అనేక చోట్ల నిలిచిపోయింది.

READ ALSO | Budgam Terrorist Video: నీకేం కాదు, బయటికి రా! ఉగ్రవాదితో సైన్యం ఎలా వ్యవహరించిందో చూడండి

మరికొన్ని ప్రాంతాల్లో నీరు తన మార్గాన్ని ఎంచుకుని వీధీ వాకిలీ అని చూడకుండా వేగంగా ప్రవాహిస్తోంది. వెరసీ హైదరాబాద్ నగరవాసుల జీవితం దుర్భరంగా మారింది. అధికారులు, వివిధ స్వచ్ఛంద సంస్థలు తమ వంతుగా ప్రజలకు అండగా నిలవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పరిస్థితి మారాలి అని సగటు నగరవాసి కోరుకుంటున్నాడు.

అయితే వాతావరణ శాఖ మాత్రం హైదరాబాద్ నగరంలో వర్షాలు ( Hyderabad Rains ) కురిసే అవకాశం ఉంది అని ప్రకటించింది. ఈ విషయాన్ని నిజం చేస్తూ శనివారం సాయంత్రం నుంచి మళ్లీ వర్షం మొదలైంది. దీంతో ప్రజల్లో మళ్లీ టెన్షన్ మొదలైంది.

దీని గురించి నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ ఇలా రియాక్ట్ అయింది.

దాంతో చిన్నపాటి వర్షానికే మళ్లీ భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

ALSO READ | LPG Gas: గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తున్నారా ? ఈ కొత్త రూల్ గురించి తెలుసుకోండి!

ఈ ట్రాఫిక్ జామ్ వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్న సమయంలో ఒక వ్యక్తి మాత్రం రోడ్డుపై ఈత కొడుతూ దూసుకెళ్లాడు. ఇతని వీడియో కొంత మందికి సరదాగా అనిపించినా చాలా మంది ఇలాంటి పరిస్థితి రావడం ఏంటి అని అంటున్నారు. ఆ వీడియో మీరు కూడా చూడండి.

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G IOS Link - https://apple.co/3loQYeR

Trending News