Two More arrests in TSPSC Paper Leaks Case: తెలంగాణలో సంచలనం రేపిన టీఎస్పీఎస్సీ కేసులో మరో ఇద్దరిని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అరెస్ట్ చేసింది. వీరిద్దరితో కలిపి ఇప్పటివరకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం 17 మందిని అరెస్ట్ చేసినట్లు తేలింది. హైదరాబాదుకు చెందిన సాయి లౌకిక్ అనే వ్యక్తి తన ప్రియురాలు సాయి సుష్మిత కోసం దాదాపు ఆరు లక్షల రూపాయలకు డీఏవో పేపర్ కొన్నట్లుగా గుర్తించారు. తన ప్రియురాలు సుస్మిత డీఏవో పరీక్ష రాస్తున్న నేపథ్యంలో ఆమె ఖచ్చితంగా ఉద్యోగం తెచ్చుకోవాలి అనే ఉద్దేశంతో ఆరు లక్షల రూపాయలు సాయి లౌకిక్. ప్రవీణ్ కు ఇచ్చినట్లుగా గుర్తించారు.
ఈ రోజు జరిగిన సిట్ విచారణలో నిందితుడు ప్రవీణ్ సాయి లౌకిక్ కి డిఏఓ పేపర్ అమ్మినట్లు దృష్టికి తీసుకువెళ్లడంతో వెంటనే ఆ ఇద్దరినీ కస్టడీలోకి తీసుకుని విచారణ జరపగా విచారణలో తాము పేపర్ కొన్నట్లుగా నిందితులు అంగీకరించారు. వెంటనే పోలీసులు సాయి లౌకిక్, సాయి సుష్మిత ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఇక సంచలనం రేపుతున్న ఈ కేసులో కేసీఆర్ హస్తం ఉందని బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ ఛుగ్ ఆరోపించారు.
Also Read: Bandi Sanjay Gets Bail: బండి సంజయ్‌కి బెయిల్.. జైలు నుంచి విడుదల ఎప్పుడంటే..
30 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో కెసిఆర్ ఆడుకుంటున్నారని ఆయన తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో కేసీఆర్ రాజ్యాంగం నడుస్తోందని తమ తప్పులు కప్పిపించుకోవడానికి కేసీఆర్ ఇలాంటి అరెస్టు డ్రామాలు చేస్తున్నారని అన్నారు. తెలంగాణలో లిక్కర్ మాఫియా, లీకేజీ మాఫియా నడుస్తోందని ఇలానే కేసీఆర్ తెలంగాణని బ్రష్టు పట్టిస్తున్నారని ఆయన అన్నారు. ఇక బండి సంజయ్ అత్తగారి ఇంటికి వెళ్లిన తరుణ్ ఛుగ్ ఒక ఎంపీని అరెస్టు వారెంట్ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు.
తమ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను కావాలని అక్రమంగా అర్థరాత్రి సమయంలో అరెస్ట్ చేశారని బండి సంజయ్ ఫోన్ సైతం పోలీసులే దొంగలించారని ఆయన ఆరోపించారు. ఇక మీదట ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తే సహించేది లేదని పేర్కొన్న ఆయన బీజేపీ కచ్చితంగా సత్యం కోసం ధర్మం కోసం పోరాటం చేస్తుందని అన్నారు. తెలంగాణలో విద్యార్థులు, నిరుద్యోగుల తరఫున బిజెపి పోరాడుతుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ తల్లి ఆశీర్వాదం తీసుకుంటూ మీ కొడుకు వారియర్ మీరు బాధపడాల్సిన అవసరం లేదంటూ ఆమెకు ధైర్యం చెప్పినట్లు తెలుస్తోంది.
Also Read: SSC Students Complaint on Bandi Sanjay: బండి సంజయ్‌పై పదో తరగతి విద్యార్థుల ఫిర్యాదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook