Tamilisai Soundararajan: తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌పై దాఖలైన పరువునష్టం కేసు కొట్టివేత

Telangana Governor Tamilisai Soundararajan case: సమన్లు, కేసును రద్దు చేయాలని కోరుతూ తమిళిసై సౌందరరాజన్‌ మద్రాస్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. విచారణలో భాగంగా న్యాయమూర్తి జస్టిస్‌ దండపాణి మాట్లాడుతూ.. రాజ్యాంగం వాక్‌ స్వాతంత్య్రం, వ్యక్తీకరణ స్వేచ్ఛను అందించినప్పటికీ వాటికి పరిమితులు విధించిందన్న విషయాన్ని గుర్తుచేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 29, 2021, 09:43 AM IST
  • తమిళిసై సౌందరరాజన్‌పై దాఖలైన పరువునష్టం కేసు కొట్టివేత
  • ఉత్తర్వులిచ్చిన మద్రాస్‌ హైకోర్టు
  • తమిళిసై 2017లో బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న సమయంలో వీసీకే అధ్యక్షుడు తిరుమావళవన్‌పై వ్యాఖ్యలు
Tamilisai Soundararajan: తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌పై దాఖలైన పరువునష్టం కేసు కొట్టివేత

HC quashes defamation case against Telangana Governor Tamilisai Soundararajan: తెలంగాణ గవర్నర్‌, పుదుచ్చేరి ఇన్‌ఛార్జి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా ఉన్న తమిళిసై సౌందరరాజన్‌పై (Tamilisai Soundararajan) దాఖలైన పరువునష్టం కేసు కొట్టివేస్తూ మద్రాస్‌ హైకోర్టు (Madras High Court) తాజాగా ఉత్తర్వులిచ్చింది. వీసీకే అధ్యక్షుడు తిరుమావళవన్‌పై వ్యాఖ్యలు చేసినందుకు తమిళిసై పరువునష్టం కేసు నమోదైంది. తమిళిసై 2017లో బీజేపీ (BJP) తమిళనాడు రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న సమయంలో.. వీసీకే (Viduthalai Chiruthaigal Katchi) (VCK),అధ్యక్షుడు తిరుమావళవన్‌ (Thirumavalavan) కట్టపంచాయత్తు (దాదాగిరి) చేస్తున్నారని మీడియాలో వ్యాఖ్యానించారు తమిళిసై సౌందరరాజన్‌. దీంతో వీసీకే సభ్యుడు తాటి కార్తికేయన్‌ (Karthikeyan) కాంచీపురం కోర్టులో పరువునష్టం వ్యాజ్యం వేశారు.

Also Read : Disha Encounter-Sajjanar: దిశ  హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసులో సజ్జనార్‌ను విచారించనున్న ఎన్‌హెచ్‌ఆర్సీ

విచారణకు తమిళిసై హాజరుకావాలంటూ కోర్టు సమన్లు పంపింది. సమన్లు, కేసును రద్దు చేయాలని కోరుతూ తమిళిసై సౌందరరాజన్‌ (Tamilisai Soundararajan) మద్రాస్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. విచారణలో భాగంగా న్యాయమూర్తి జస్టిస్‌ దండపాణి మాట్లాడుతూ.. రాజ్యాంగం వాక్‌ స్వాతంత్య్రం, వ్యక్తీకరణ స్వేచ్ఛను అందించినప్పటికీ వాటికి పరిమితులు విధించిందన్న విషయాన్ని గుర్తుచేశారు. తర్వాత కేసు కొట్టివేస్తున్నట్లు ప్రకటించారు. మొత్తానికి తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌పై (Tamilisai Soundararajan) ఉన్న పరువునష్టం కేసు కొట్టివేస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.

Also Read : పవన్ ఫ్యాన్స్ పై పోసాని ఫైర్! పవన్ ను కేసీఆర్ తిట్టినప్పుడు స్పందించలేదు ఎందుకు?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News