Lok Sabha Elections 2024: ఓవైసీకి దిమ్మతిరిగే షాక్.. మాధవీలత భారీగా నామినేషన్ ర్యాలీ

Lok Sabha Polls 2024: బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్ధి మాధవీలత ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్‌ దాఖలు సందర్భంగా ఉదయం భగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయాన్ని దర్శించారు మాధవీలత.  

Written by - Samala Srinivas | Last Updated : Apr 24, 2024, 04:38 PM IST
Lok Sabha Elections 2024: ఓవైసీకి దిమ్మతిరిగే షాక్.. మాధవీలత భారీగా నామినేషన్ ర్యాలీ

Lok Sabha Elections 2024: ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల్లో అందరి దృష్టిని ఎక్కువ ఆకర్షిస్తోన్న పార్లమెంట్ స్థానం హైదరాబాద్. ఇది  ఏఐఎంఐఎం పార్టీకి కంచుకోట. నలభై ఏళ్లుగా ఆ పార్టీ నేతలే పాగా వేసుకుని కూర్చున్నారు.  1984 నుంచి 1999 వరకు సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ, 2004 నుంచి ఆయన పెద్దకుమారుడు కుమారుడు అసదుద్దున్ ఓవైసీ హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి గెలుస్తూ వస్తున్నారు.  అయితే ఈసారి జరగబోయే ఎన్నికల్లో మజ్లిస్ గెలుపు అంతా ఈజీ కాదనే చెప్పాలి. వారికి పోటీగా బీజేపీ మాదవీలతను నిలబెట్టింది. దీంత ఓవైసీ ధీటుగా ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు మధవీలత. 

నామినేషన్ వేయనున్న మాధవీలత
బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్ధి మాధవీలత ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఓల్డ్ సిటీ నుంచి భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేస్తారు. ముందుగా చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయంలో నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి.. ఆ తర్వాత భారీ ర్యాలీగా నామినేషన్ కు బయలుదేరుతారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ పాల్గొననున్నారు. భాగ్యలక్ష్మీ టెంపుల్ నుంచి లక్డీ కపూల్ వరకు ర్యాలీ కొనసాగనుంది. ఈ సందర్భంగా ప్రత్యర్ధి అసదుద్దీన్‌ ఓవైసీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు మాధవీలత. 

అసదుద్దీన్‌ ఓవైసీపై తీవ్ర వ్యాఖ్యలు 
MIM నేత అక్బరుద్దీన్‌  కాషాయ నేతలపై చేసిన వ్యాఖ్యలపై కౌంటర్‌ ఇచ్చారు హైదరాబాద్‌ బీజేపీ పార్లమెంట్‌ అభ్యర్ధి మధవీలత. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ల నుంచి రొహింగ్యాలను రప్పించి , ఇక్కడ వారి జనాభాను పెంచుతున్నారని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశాలు. అన్ని మతాలకు సమానంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రధాని మోదీని విమర్శించు హక్కు ఎంఐఎం నేతలకు లేదని మండిపడ్డారు. నామినేషన్‌ దాఖలు సందర్భంగా ఉదయం భగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయాన్ని దర్శించి పూజలు చేసిన అనంతరం మాధవీలత ఈ వ్యాఖ్యలు చేశారు.

Also Read: KCR: ఏపీలో మళ్లీ సీఎం జగన్.. కుండబద్దలు కొట్టేసిన కేసీఆర్

Also read: TS Inter Result 2024 Live: ఇంటర్ ఫలితాలు బిగ్ అలర్ట్.. ఆ రోజు నుంచే సప్లిమెంటరీ పరీక్షలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News