Hyderabad Rains: హైదరాబాద్ లో మళ్లీ కుండపోత.. లోతట్టు ప్రాంతాల్లో భయంభయం.. మూసీ ఉప్పొంగితే ప్రళయమే..

Hyderabad Rains:హైదరాబాద్ లో మళ్లీ  భారీ వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురుస్తోంది. నగరంలోని దాదాపు అన్నిప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. రాగల మూడు గంటల్లో తేలికపాటి నుంచి మోస్తారువర్షాలు.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Edited by - Srisailam | Last Updated : Aug 2, 2022, 09:07 AM IST
Hyderabad Rains: హైదరాబాద్ లో మళ్లీ కుండపోత.. లోతట్టు ప్రాంతాల్లో భయంభయం.. మూసీ ఉప్పొంగితే ప్రళయమే..
Live Blog

Hyderabad Rains: హైదరాబాద్ లో మళ్లీ  భారీ వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురుస్తోంది. నగరంలోని దాదాపు అన్నిప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. కూకట్ పల్లిస ఎర్రమంజిల్, ఖైరతాబాద్, బహీర్ బాగ్, అమీర్ పేట, సికింద్రాబాద్, తార్నాక, సోమాజిగూడ, కోఠి, నాంపల్లి ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. మాదాపూర్, ఉప్పల్, చాదర్ ఘాట్, మలక్ పేట, నారాయణగూడ, హిమాయత్ సాగర్ , నాచారం, మల్లాపురం, లక్డికపూల్ లో కుండపోతగా వర్షం కురుస్తోంది. భారీ వర్షంతో వరద రోడ్లపైకి వస్తోంది. పంజాగుట్ట శశ్మానవాటిక దగ్గర భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

2 August, 2022

  • 16:30 PM

    Hyderabad and Telangana Weather Reports : ఆగస్టు 1 వ తేదీ నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు తెలంగాణ వ్యాప్తంగా అక్కడక్కడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులు పడే ప్రమాదం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

  • 14:02 PM

    హైదరాబాద్ ను కమ్మేసిన దట్టమైన మబ్బులు

    మరో గంటలో కుండపోతగా వర్షం

    ఇప్పటికే ప్రమాదకరంగా మూసీ

    వరద పెరిగితే లోతట్టు ప్రాంతాలకు ముప్పు

    భారీ వర్షం సూచనతో అధికారుల్లో కలవరం

    ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కు భారీగా వరద

    సాయంత్రానికి వరద మరింత పెరిగే అవకాశం

     

  • 12:47 PM

    ఉస్మాన్ సాగర్ కు మళ్లీ భారీగా వరద వస్తోంది. డ్యాంలోకి ఎగువ నుంచి వెయ్యి క్యూసెక్కుల వరద వస్తుండగా.. ప్రాజెక్ట్ నాలుగు గేట్లను నాలుగు అడుగుల మేర ఎత్తి 1552 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. హిమాయత్ సాగర్ రిజర్వాయర్ కు ఎగువ నుంచి 6 వందల క్యూసెక్కుల వరద వస్తుండగా.. రెండు గేట్లను ఎత్తి 660 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. జంట జలాశయాల నుంచి భారీగా వరద మూసీలోకి వస్తుండటంతో లోతట్టు ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు.

  • 12:42 PM

    పంజాగుట్ట సర్కిల్ లో భారీగా వరద

    ఖైరతాబాద్ కూడలిని ముంచెత్తిన వరద

    కోఠి నుంచి పంజాగుట్ట వెళ్లే వాహనాలకు బ్రేక్

  • 12:08 PM

    నగరం లో కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ  తలెత్తకుండా   అధికారులను అప్రమత్తం చేశారు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయ  లక్ష్మి . సెల్ కాన్ఫరెన్స్  ద్వారా  ఎప్పటి కప్పుడు సమీక్షిస్తూ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు.

  • 11:38 AM

    సోమవారం ఉదయం నుంచి 11 గంటల వరకు నగరంలో కురిసిన వర్షపాతం..

    మల్కాజిగిరి ప్రశాంత్ నగర్ కమ్యూనిటీ హాల్ 7.3 సెంటీమీటర్లు

    వెస్ట్ మారేడ్ పల్లి  6.6 సెంటీమీటర్లు

    మల్కాజ్ గిరి మధుసూదన్ నగర్  6.3 సెంటీమీటర్లు

    మెట్టుగూడ  4.6 సెంటీమీటర్లు

    మల్కాజిగిరి మహేశ్వర్ నగర్ 3.7 సెంటీమీటర్లు

    మల్కాజిగిరిలో 3.7 సెంటీమీటర్లు

    గణాంక భవన్ 3.5 సెంటీమీటర్లు

    సీతాఫల్ మండి 3.2 సెంటీమీటర్లు

    చిల్కానగర్  3.1సెంటీమీటర్లు

  • 11:31 AM

    భారీ వర్షంతో హైదరాబాద్ రోడ్లపైకి వరద

    ప్రధాన కూడళ్లలో భారీగా ట్రాఫిక్ జామ్

    గంటలకొద్ది ట్రాఫిక్ లో వాహనదారులకు నరకం

    పంజాగుట్ట, కూకట్ పల్లిలో భారీగా ట్రాఫిక్ జామ్

  • 11:17 AM

    రాగల మూడు గంటల్లో తేలికపాటి నుంచి మోస్తారువర్షాలు.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మేడ్చల్, హైదరాబాద్, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ ,నారాయణపేట్, జోగులంబ, సిద్దిపేట్, భువనగిరి, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలోని పలు ఏరియాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.

     

Trending News