KTR Health Update: మాజీ మంత్రి కేటీఆర్ అస్వస్థతకు గురయ్యారు. కొద్ది రోజులుగా విస్తృతంగా అనేక సభలు సమావేశాలలో పాల్గొన్నంటున్న ఆయన.. గత రెండు రోజులుగా తీవ్రమైన జ్వరం, ఫ్లూ లక్షణాలతో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. ఇటీవల కామారెడ్డిలో జరిగిన సమావేశం అనంతరం జ్వరంతో బాధపడుతున్నారు. ఇంకా పూర్తగా కోలుకోలేకపోవడంతో నేడు కరీంనగర్‌లో జరుగుతున్న కదన భేరి సభకు దూరమయ్యారు. వైద్యుల పర్యవేక్షణలో ఇంటి వద్దనే చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో కేటీఆర్ పూర్తిగా కోలుకుంటారని డాక్టర్లు చెబుతున్నారు.
మంగళవారం సాయంత్రం రీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీ మైదానంలో భారీ ఎత్తున బీఆర్ఎస్ కదన భేరి సభను నిర్వహించనుంది. ఈ సభకు దాదాపు లక్షమంది హాజరయ్యే అవకాశం ఉండగా.. ఇక్కడి నుంచే గులాబీ అధినేత కేసీఆర్ లోక్‌సభ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలవడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తోంది. పార్లమెంట్ స్థానాల వారీగా సమీక్షలు నిర్వహించిన కేసీఆర్.. ఈ సభ ద్వారా కేడర్‌లో భరోసా నింపి ఎన్నికలకు గులాబీ దండులో ఉత్సాహం నింపాలని చూస్తున్నారు.
కేటీఆర్ ఆవేదన..
తెలంగాణ నుంచి తరలిపోతున్న పెట్టుబడులపైన మాజీ మంత్రి కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకువచ్చేందుకు చేసిన కృషి నిష్ఫలం అవుతుందన్న ఆవేదన వ్యక్తం చేశారు. కేన్స్ సెమికాన్ సంస్థ రాష్ట్రం నుంచి గుజరాత్‌కు తరలిపోతున్నట్లు వస్తున్న వార్తలపై స్పందిస్తూ.. గతంలో ఈ కంపెనీ కర్ణాటక రాష్ట్రానికి వెళ్లేందుకు సిద్ధమైనప్పుడు ఎన్నో ప్రయత్నాలు చేసి తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా ఒప్పించామని గుర్తు చేశారు. కొంగరకలాన్‌లో ఫాక్స్ కాన్ పరిశ్రమకు దగ్గరగా భూమి కేటాయింపు కావాలంటే.. కేవలం పది రోజుల్లోనే అవసరమైన భూమిని కేటాయించామన్నారు.
ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన కేటీఆర్.. ఈ కంపెనీ OSAT యూనిట్ ఏర్పాటు, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంతో పాటు, సెమీ కండక్టర్ పరిశ్రమ ఈకో సిస్టమ్‌కి అత్యంత కీలకమైనదని చెప్పారు. ఈ కంపెనీ వస్తే.. ఈ రెండు రంగాల్లో తెలంగాణ రాష్ట్రం మరింత పురోగతి సాధించే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ సర్కారు వెంటనే స్పందించి.. కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి మన రాష్ట్రంలోనే పెట్టుబడులు కొనసాగించేలా ఒప్పించాలని కోరారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter