Large tree fell in cantonment govt hospital at bollarum: కొన్నిసార్లు అనుకొని ఘటనలు జరుగుతుంటాయి. ప్రమాదం ఎప్పుడు ఎక్కడ నుంచి వస్తుందో ఎవరు చెప్పలేరు. మనం రోడ్డుపైన వెళ్తున్నప్పుడు, యాక్సిడెంట్స్ జరుగుంటాయి. మన దారిలో మనంపోతున్న కూడా.. కొందరు వచ్చి మనల్ని ప్రమాదంలో నెట్టేస్తుంటారు. ఇక మరికొన్నిసార్లు.. మన తప్పుల వల్ల ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇక మన టైమ్ బాగుంటే ప్రమాదాల నుంచి బైటపడే అవకాశం ఉంటుంది. కానీ కొన్నిసార్లు టైమ్ బాగుండకుంటే మాత్రం ప్రాణాలు గాల్లొ కలిసి పోవడం ఖాయం. ఇక కొన్నిసార్లు ప్రమాదాలు వెంట్రుకల వాసిలో నుంచి బైటపడిపోతుంటాం. కానీ మన టైమ్ బాగుండకపోతే.. నీడ కోసం వెళ్లిన చెట్లు విరిగి తలమీద పడటం, తాడుకదా అని పట్టుకుంటే.. అది పాములా మారి కాటు వేయడం వంటికి జరుగుతుంటాయి. సోషల్ మీడియాలో సెకను వ్యవధిలో చాలా మంది డెంజర్ ప్రమాదాల నుంచి బైటపడిన సంఘటనలు కొకొల్లలు.
A tree falls on the couple during their visit to cantonment hospital in Bollaram in #Hyderabad.
The husband died on the spot, while his wife sustained serious injuries. pic.twitter.com/OtK2bta6Oa
— NewsMeter (@NewsMeter_In) May 21, 2024
ఈవీడియోలు చూస్తే మాత్రం ఒక్కసారిగా షాకింలా అన్పిస్తుంటుంది. ఇక మరోవైపు హైదరాబాద్ లో తాజాగా, జరిగిన ఘటన తీవ్ర విషాకరంగా మారింది. కంటోన్మెంట్ ఆస్పత్రి పరిధిలో దంపతులు ఆస్పత్రికి వెళ్దామని స్కూటమ్ మీద స్టార్ట్ అయ్యారు. హస్పిటల్ లోకి ఎంటర్ అయ్యారు. ఒక్కసారిగా భారీ చెట్టు విరిగి వాళ్ల మీద పడింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పూర్తి వివరాలు..
హైదరాబాద్ లో కంటోన్మెంట్ పరిధిలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. బొల్లారంలోని కంటోన్మెంట్ ఆస్పత్రి వద్ద ఒక చెట్టు విరిగి పడిన ఘటనలో భర్త అక్కడిక్కడే చనిపోగా, భార్యకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే ఆస్పత్రి ప్రాంగణంలోని సిబ్బంది పరుగున వచ్చి చెట్టు ను పక్కకు జరిపి, మహిలను ఆస్పత్రికి తరలించారు. కొన్నిరోజులుగా ఆరోగ్యం బాగా ఉండకపోవడంతో.. రవీందర్, సరళాదేవి లు కంటోన్మెంట్ కు వచ్చారు. ఆస్పత్రి ప్రాంగణంలోకి స్కూటర్ మీద ఎంట్రీ ఇస్తున్నారు. ఇంతలో.. ఒక్కసారిగా భారీ చెట్టు విరిగిపోయి వారి మీద పడింది. ఇద్దరు కూడా చెట్టుకిందనే చిక్కుకుపోయారు. స్థానికులు, ఆస్పత్రి సిబ్బంది అక్కడికి చేరుకుని, చెట్టును పక్కకు జరిపే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే రవీందర్ చనిపోయినట్లు గుర్తించారు. అతని భార్య సరళా దేవీలకు ప్రథమ చికిత్స అందించారు.
Read more: Snakes facts: ప్రపంచంలోనే అత్యంత స్పీడ్ గా వెళ్లే పాములు.. ఇవి చాలా డెంజర్ భయ్యా.. డిటెయిల్స్ ఇవే..
పరిస్థితి సీరియస్ గా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం గాంధీకి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.అయితే ఈ ఉదయం చికిత్స నిమిత్తం కంటోన్మెంట్ ఆస్పత్రి వద్దకు దంపతులు రవీందర్, సరళాదేవి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. సరళాదేవి ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నట్లు గుర్తించారు. రవీందర్ మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. రవీందర్ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. భారీ చెట్టు వారి తలమీద పడటంతో ఘోరం జరిగినట్లు తెలుస్తొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter