ktr attending infront of womens commission on free bus comments issue: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గతంలో మహిళలపై ఫ్రీ బస్సు విషయంలో చేసిన వ్యాఖ్యలు రచ్చగా మారిన విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ మంత్రులు, మహిళ నేతలను తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేటీఆర్ వ్యాఖ్యలపై ఏకంగా మహిళ కమిషన్ ఘటనను సుమోటోగా స్వీకరించింది. ఈరోజు (శనివారం) కేటీఆర్.. మహిళ కమిషన్ ఎదుట హజరయ్యారు. ఈ నేపథ్యంలో ఆసక్తి కర పరిణామం చోటు చేసుకుంది. కేటీఆర్ గతంలో మంత్రులుగా పనిచేసిన మహిళ నేతలతో కలిసి, మహిళ కమిషన్ ఎదుట హజరయ్యారు.
షాద్ నగర్లో దళిత మహిళపై, కొల్లాపూర్లో ఒక చెంచు మహిళపై జరిగిన అఘాయిత్యాలపై, రాష్ట్రంలోని హాస్టల్లలో, వసతి గృహాల్లో పిల్లల పరిస్థితి బాలేదు అని చెప్తుంటే మహిళా కమిషన్ చైర్మన్ గారు ఇంకో రూపంలో రండి సమయం ఇస్తాము అప్పుడు అన్ని చెప్పండి అని చెప్పారు..
భవిష్యత్తులో తప్పకుండా మా పార్టీ… pic.twitter.com/pIeqPjU8Vw
— Telugu Scribe (@TeluguScribe) August 24, 2024
ఈ క్రమంలో మహిళ కమిషన్ సభ్యులు .. కేటీఆర్ కు రాఖీలు కట్టి తమ అభిమానం చాటుకున్నారు. ఆ తర్వాత కేటీఆర్ మహిళ కమిషన్ ఎదుట హజరై.. తన వ్యాఖ్యల పట్ల క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా.. తాను ఉద్దేష పూర్వకంగా చేసిన మాటలు కాదని, తన మాటల్ని వక్రీకరించారని కూడా క్లారిటీ ఇచ్చారు. చట్టాన్ని, మహిళలను గౌరవించే వ్యక్తిగా నేను మాట దొర్లటం పై క్షమాపణ అడిగినట్లు చెప్పారు. అంతేకాకుండా.. తెలంగాణలో ప్రస్తుతం జరిగిన అనేక ఘటనలపై ఆయన మహిళ కమిషన్ ఎదుట ప్రస్తావించారని తెలుస్తోంది.
షాద్ నగర్లో దళిత మహిళలపై, కొల్లాపూర్లో ఒక చెంచు మహిళపై జరిగిన అఘాయిత్యాలపై, రాష్ట్రంలోని హాస్టళ్లలో, వసతి గృహాల్లో పిల్లల పరిస్థితి బాగోలేదని మంత్రి కేటీఆర్.. మహిళ కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన మహిళ కమిషన్.. మరోమారు ఈ విషయాలపై రావాలని, అప్పుడు దీనిపై విచారణ జరుపుతామని చెప్పింది. ఈ క్రమంలో తమ పార్టీకి చెందిన మహిళ నేతలు.. భవిష్యత్తులో తెలంగాణలోని మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై మరోసారి మహిళ కమిషన్ చైర్మన్ ను కలుస్తారని కూడా కేటీఆర్ వెల్లడించారు.
మరోవైపు.. చట్టాన్ని గౌరవిస్తూ మేము కమిషన్ ముందు వస్తే… మహిళ కాంగ్రెస్ నేతలు మా నాయకులపై, మాపై దాడి చేశారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. మహిళలను గౌరవించాలనే ఉద్దేశంతో మేము వస్తే ఇలాంటి దాడి చేయటం సరికాదన్నారు. 8 నెలల్లో మహిళలపై జరిగిన సంఘటనలను మహిళ కమిషన్ ఎదుట వివరంగా చెప్పామన్నారు. మరోవైపు.. ఈ క్రమంలో.. బుద్దభవన్ బైట కాసేపు హల్ చల్ చోటు చేసుకుంది.
కాంగ్రెస్ మహిళ కమిషన్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతా రావ్ అక్కడికి చేరుకుని నినాదాలు చేసి బైఠాయించారు. కేటీఆర్ ట్విటర్ లో కాదు.. బహిరంగంగా మహిళలకు సారీ చెప్పాలన్నారు. దీంతో బస్ భవన్ ఎదుట బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్తల మధ్య పోటాపోటీనీ నిరసనలు చేశారు. కాసేపు తోపులాట జరగటంతో పోలీసులు పెద్దఎత్తున చేరుకుని పరిస్థితుల్ని అదుపులోకి తీసుకొచ్చారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook