క్రికెట్‌కు కోహ్లీ.. తెలంగాణకు కేటీఆర్..!

        

Last Updated : Oct 15, 2017, 02:36 PM IST
క్రికెట్‌కు కోహ్లీ.. తెలంగాణకు కేటీఆర్..!

భారత క్రికెట్ జట్టులో విరాట్‌ కోహ్లికి ఎంత ప్రాధాన్యత ఉందో.. తెలంగాణ ప్రభుత్వంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌‌కు కూడా అంతే ప్రాధాన్యం ఉందని భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ కృష్ణమాచారి శ్రీకాంత్‌ అభిప్రాయపడ్డారు. నిట్‌ ఆడిటోరియంలో శనివారం జరిగిన ఒక విద్యార్థుల కార్యక్రమంలో ఐటీ శాఖమంత్రి కేటీఆర్‌తో పాటు క్రికెటర్‌ శ్రీకాంత్‌ కూడా పాల్గొన్నారు.  ఈ సందర్భంగా కేటీఆర్‌ విద్యార్థులతో మాట్లాడుతూ 1987లో హైదరాబాద్‌లో జరిగిన భారత్ - పాక్ క్రికెట్‌ మ్యాచ్‌లో శ్రీకాంత్‌  బ్యాటింగ్‌ చేస్తుంటే... పాక్‌ బౌలర్‌ వసీం అక్రమ్‌ వేసిన బంతి ఆయన కంటికి గట్టిగా తగిలి రక్తం కారిందన్నారు.

వెంటనే శ్రీకాంత్ డ్రెస్సింగ్‌ రూమ్‌కి వెళ్ళి,  నాలుగు కుట్లు వేయించుకుని తిరిగి క్రీజ్‌లోకి వచ్చి ఆడారని మంత్రి కేటీఆర్‌ గుర్తు చేశారు. సమస్యలకు ఎదురుతిరిగి పోరాడే  ధైర్యం విద్యార్థులకు ఉండాలనే  ఈ సంఘటనను ప్రస్తావించానన్నారు. ఆ తర్వాత క్రికెటర్‌ శ్రీకాంత్‌ మాట్లాడుతూ ప్రస్తుతం భారతదేశంలో తెలంగాణ నెంబర్ వన్  రాష్ట్రంగా దూసుకుపోతుందని అన్నారు. ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌లో విరాట్‌ కోహ్లి ఎలాగో.. తెలంగాణకు కేటీఆర్‌ అలాగే అని కితాబిచ్చారు. 

Trending News