రాష్ట్రపతిని ప్రపంచ ఐటి సదస్సుకి ఆహ్వానించిన కేటీఆర్

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) ఈ రోజు దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి రామనాథ్ కోవింద్‌ను కలిశారు.

Last Updated : Feb 9, 2018, 04:36 PM IST
రాష్ట్రపతిని ప్రపంచ ఐటి సదస్సుకి ఆహ్వానించిన కేటీఆర్

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) ఈ రోజు దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి రామనాథ్ కోవింద్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయనను కేటీఆర్ త్వరలో హైదరాబాద్‌‌లో జరగనున్న ప్రపంచ ఐటి సదస్సు (వరల్డ్ ఐటి కాంగ్రెస్) కు ఆహ్వానించారు. ఈ నెల 19వ తేది నుండి 21వ తేది వరకు జరిగే ఈ సదస్సుకు భాగ్యనగరం వేదిక కానుంది.

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ సదస్సును ఢిల్లీ నుండి వీడియా కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారు. నాస్కామ్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం పార్టనర్‌గా ఈ సదస్సు జరగనుంది. శ్రీలంక ప్రధాని విక్రమసింఘే ఈ సదస్సుకు అతిథిగా వస్తున్నారు. గూగుల్, సిస్కో, హెచ్‌‌ఎస్‌బీసీ సంస్థలు ఈ సదస్సును స్పాన్సర్ చేయగా.. విప్రో డిజిటల్ పార్టనర్‌గా వ్యవహరిస్తోంది. 150 మంది ప్రపంచ ఐటీ కంపెనీల అధినేతలు ఈ సదస్సులో పాల్గొననున్నారు. 

Trending News