సీఎం కేసీఆర్ పుట్టిన రోజున పచ్చని చెట్టుకు ప్రాణం పోద్దాం

 ఫిబ్రవరి 17న ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని, ఆయన పేరుతో మొక్కను నాటుదామని మంత్రి కేటిఆర్ పిలుపునిచ్చారు. సెల్ఫీ విత్ ‘‘సీఎం సర్ సాప్లింగ్’’ కార్యక్రమంలో పాల్గొందామని, భావి తరాలకు హరిత బహుమతిని అందిద్దామని, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేద్దామని అన్నారు.

Last Updated : Feb 10, 2020, 10:58 PM IST
సీఎం కేసీఆర్ పుట్టిన రోజున పచ్చని చెట్టుకు ప్రాణం పోద్దాం

హైదరాబాద్: ఫిబ్రవరి 17న ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని, ఆయన పేరుతో మొక్కను నాటుదామని మంత్రి కేటిఆర్ పిలుపునిచ్చారు. సెల్ఫీ విత్ ‘‘సీఎం సర్ సాప్లింగ్’’ కార్యక్రమంలో పాల్గొందామని, భావి తరాలకు హరిత బహుమతిని అందిద్దామని, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేద్దామని అన్నారు.

 

రేపటి తరానికి మనం కూడబెట్టాల్సింది  ధన సంపద మాత్రమే కాదు, వన సంపద అనే సీఎం కేసీఆర్ ఆలోచనావిధానానికి  అనుగుణంగా మనం వ్యవహరించాల్సిన రోజులు వచ్చాయని ఆయన అన్నారు.

 

మనందరిలో స్పూర్తిని నింపే దిశగా హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించి తెలంగాణను హరిత తెలంగాణగా తీర్చిదిద్దేందుకు అహర్నిషలు కృషి చేస్తున్న సీఎం స్పూర్తితో ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని మీరందరూ ఆదరిస్తుండడం నాకు ఎంతో ఆనందాన్నిస్తున్నదని, పచ్చని మొక్కను పసిపాపలా సాదుకుంటున్నందుకు మీ అందరికీ నా అభినందనలు క్రుతజ్జతలు అని అన్నారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News