Dubbaka Bypolls: అపజయాలకు కుంగిపోము, ఓటమిని విశ్లేషిస్తాం-కేటీఆర్

దుబ్బాక ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. భాజపా అభ్యర్థి రఘునందన్ రావు మాధవనేని ( Raghunandan Rao ) గెలుపు సాధించారు.

Last Updated : Nov 10, 2020, 05:09 PM IST
    1. దుబ్బాక ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది.
    2. భాజపా అభ్యర్థి రఘునందన్ రావు మాధవనేని గెలుపు సాధించారు.
    3. అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాత 62022 ఓట్లతో రెండు స్థానాన్ని కైవసం చేసుకన్నారు.
    4. ఈ ఓటమిపై తెరాసా పార్టీ వర్కింగ్ ప్రెసెడెంట్, మంత్రి కేటీఆర్ స్పందించారు.
Dubbaka Bypolls: అపజయాలకు కుంగిపోము, ఓటమిని విశ్లేషిస్తాం-కేటీఆర్

దుబ్బాక ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. భాజపా అభ్యర్థి రఘునందన్ రావు మాధవనేని ( Raghunandan Rao ) గెలుపు సాధించారు. అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి ( TRS ) సోలిపేట సుజాత 62022 ఓట్లతో రెండు స్థానాన్ని కైవసం చేసుకన్నారు. ఈ ఓటమిపై తెరాసా పార్టీ వర్కింగ్ ప్రెసెడెంట్, మంత్రి కేటీఆర్ స్పందించారు.

Also Read | Raghunandan Rao: బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలివే

దుబ్బాక ఎన్నికల్లో ఓటమి తరువాత స్పందించిన మంత్రి కేటీఆర్ ( KTR ).. గెలుపు ఓటములను సమంగా తీసుకుంటాం అని తెలిపారు. తమ పార్టీని నమ్మి 60 వేలకు పైగా ఓట్లు వేసిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో పార్టీకోసం కష్టపడిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపాడు కేటీఆర్. 

Also Read | Grama Sachivalayam Dress Code: గ్రామ సచివాలయ సిబ్బందికి యూనిఫార్మ్

దుబ్బాక ఎన్నికల్లో ఫలితం తాము ఆశించిన విధంగా రాలేదు అని... గత ఆరున్నర సంవత్సరాలకు ఎన్నో విజయాలు సాధించామని, ఈ రోజు ఆశించింది జరగలేదు అని పేర్కొన్నారు.  సాధారణంగా అందరూ గెలుపు కోసమే పని చేస్తారు. మేము అలాగే చేశాము. ఈ ఎన్నికల్లో ఓటింగ్ సరళి తమను అలెర్ట్ చేసినట్టు..ఫలితాలను విశ్లేషించి, ప్రజా తీర్పును సమీక్షించి భవిష్యత్కతు కార్యచరణను సిద్ధం చేస్తాం అని తెలపారు కేటీఆర్.

Also Read | IPL 2020 Final MIvsDC: ఐపీఎల్ 2020 విజేతకు వచ్చే ప్రైజ్ మనీ ఎంతో తెలుసా ?

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

 

Trending News