KT Rama Rao: తెలంగాణపై సోయిలేనోడు సీఎం కావడం మన ఖర్మ, దౌర్భాగ్యం: కేటీఆర్‌

KTR Vs Revanth Reddy: ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్‌ రెడ్డిపై బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సోయిలేనోడు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు 'ఎక్స్‌'లో స్పందించారు. ఈ సందర్భంగా సుదీర్ఘ పోస్టు చేశారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 6, 2024, 09:08 PM IST
KT Rama Rao: తెలంగాణపై సోయిలేనోడు సీఎం కావడం మన ఖర్మ, దౌర్భాగ్యం: కేటీఆర్‌

KTR Sensational Comments: తెలంగాణ ఆత్మ రేవంత్‌ రెడ్డికి లేదని.. అతడు సీఎం కావడం ఖర్మ అని, దౌర్భాగ్యం అంటూ కేటీఆర్‌ మండిపడ్డారు. తెలంగాణ దేనినైనా సహిస్తుంది కానీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే మాత్రం ఊరుకోదు అని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ సాక్షిగా తెలంగాణ ఆత్మగౌరవంపై రేవంత్‌ దాడి చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్‌ మోడల్‌ను గోల్‌మాల్‌ మోడల్‌గా అభివర్ణించారు. బంగారు తెలంగాణ మోడల్‌తో గుజరాత్‌ మోడల్‌కు పోలికెక్కడ? అని నిలదీశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, రేవంత్‌ను లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు.

Also Read: Exam Forgot: మీ మతిమరుపు తగిలెయ్య.. హాల్‌ టికెట్లు ఇచ్చి పరీక్ష మరిచిన యూనివర్సిటీ

'రేవంత్ కు తెలంగాణ ఆత్మ లేదు, గౌరవం అంతకన్నా లేదు. తెలంగాణ ఆత్మగౌరవంపై మోడీ సాక్షిగా రేవంత్‌ దాడి. అసలు తెలంగాణ సోయి లేనోడు ముఖ్యమంత్రి కావడం ఖర్మ' అని అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ ఆత్మగౌరవం విలువ తెల్వనోడు, సీఎంగా ఎన్నికవడం దౌర్భాగ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. గుజరాత్‌ మోడల్‌ను గోల్‌మాల్‌ అని, అలాంటి మోడల్‌కు బంగారు తెలంగాణ మోడల్‌తో పోలికెక్కడ అని ప్రశ్నించారు.

Also Read: NIA Reward: బాంబ్‌ పెట్టినోడిని పట్టిస్తే అక్షరాల రూ.10 లక్షల నగదు బహుమతి మీ సొంతం

ఈ సందర్భంగా నరేంద్ర మోదీపై పరోక్షంగా విమర్శలు చేస్తూ.. 'ఘనమైన గంగా జెమునా తెహజీబ్ మోడల్ కన్నా మతం పేరిట చిచ్చు పెట్టే గోద్రా అల్లర్ల మోడల్ నీకు నచ్చిందా..?' అని రేవంత్‌ రెడ్డిని కేటీఆర్‌ నిలదీశారు. నిన్నటి దాకా గుజరాత్ మోడల్‌పై నిప్పులు ప్రధాని పక్కన సీటు ఇవ్వగానే గొప్పలా? ఇదేం నీతి.. ఇదేం రీతి అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా తెలంగాణ మోడల్‌ గురించి కేటీఆర్‌ వివరించారు. 'తెలంగాణ మోడల్ అంటే సమున్నత సంక్షేమ నమూనా, సమగ్ర అభివృద్ధికి చిరునామా' అని వివరించారు. అనేక రాష్ట్రాలు, యావత్ దేశానికే నచ్చిన మోడల్ తెలంగాణ అని పేర్కొన్నారు.

'బుడిబుడి అడుగుల వయసులో బుల్లెటు వేగంతో దూసుకెళ్లిన సమగ్ర, సమ్మిళిత, సమీకృత మోడల్. దేశం మెచ్చిన ఈ తెలంగాణ నమూనాను మోదీ ముందు కించపరుస్తావా?' అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నమ్మి ఓటేసిన తెలంగాణపై ఎందుకీ నయవంచన? అని ప్రశ్నించారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని మోదీ కాళ్ల దగ్గర తాకట్టు పెడతావా? అని మండిపడ్డారు. నాడు తెలంగాణ ఉద్యమకారులపై రైఫిల్ ఎత్తావని, నేడు తెలంగాణ ఆత్మగౌరవంపై దెబ్బ కొట్టావని వివరించారు. నిన్ను చరిత్ర క్షమించదు అని ధ్వజమెత్తారు. 'నా తెలంగాణ దేనినైనా సహిస్తుంది కానీ, ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే మాత్రం ఊరుకోదు' అని స్పష్టం చేశారు. తెలంగాణ ఆత్మగౌరవ పతాకాన్ని బీఆర్‌ఎస్‌ పార్టీ ఆకాశమంతా ఎత్తుకు ఎత్తగా నేడు కాంగ్రెస్‌ పార్టీ పాతాళంలోకి పాతిపెట్టేస్తోందని తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News