KT Rama Rao: తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల అంశం రాజకీయ దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆగ్రహంగా ఉంది. ఫిరాయింపులపై న్యాయస్థానాల్లో తీవ్ర పోరాటం చేస్తున్న గులాబీ పార్టీ న్యాయం తమ వైపే ఉందని ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో బాన్సువాడలో ఉప ఎన్నిక తప్పదని ఆ పార్టీ వర్కింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఎదురుదెబ్బ తగులుతుందని పేర్కొన్నారు.
Also Read: TG DSC Key: తెలంగాణ డీఎస్సీ ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్ విడుదల.. డౌన్లోడ్ ఎలా?
బాన్సువాడలో ఉప ఎన్నికలు ఖాయమని కేటీఆర్ పేర్కొన్నారు. పార్టీ మారిన పోచారం శ్రీనివాస్ రెడ్డికి ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారని తెలిపారు. బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన పార్టీ శ్రేణులు మంగళవారం హైదరాబాద్‌లోని కేటీఆర్ నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కేటీఆర్ సమీక్ష జరిపారు. పోచారం వెళ్లిపోయినా కూడా పార్టీ శ్రేణులు ఎక్కడికి వెళ్లలేదని కేటీఆర్‌తో చెప్పారు.
Also Read: Independence Day: కేసీఆర్ బాటలోనే రేవంత్.. గోల్కొండలోనే స్వాతంత్ర్య సంబరాలు
పోచారంపై విచారం
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ పోచారం శ్రీనివాస్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని రకాలుగా గౌరవించిన పార్టీని వీడటం ఆయనకే నష్టమని తెలిపారు. కార్యకర్తల కష్టం మీద గెలిచి ఆ తర్వాత స్వార్థం కోసం పార్టీని వీడటం కార్యకర్తలను బాధించిందని పేర్కొన్నారు. కష్టకాలంలో పార్టీకి ద్రోహం చేసిన వాళ్లు ఎంత పెద్ద వాళ్లైనా సరే వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. పోచారం లాంటి వారికి కచ్చితంగా కార్యకర్తలు బుద్ధి చెప్పాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన తర్వాత పోచారం శ్రీనివాస్ రెడ్డిని కనీసం అడిగిన వాళ్లు కూడా లేని దయనీయ పరిస్థితి వచ్చిందని వివరించారు.
పార్టీ శ్రేణులకు అభినందన
ఇక రేవంత్ రెడ్డిపై కేటీఆర్ విమర్శలు చేశారు. అతడి పరిపాలన సమర్థత ఏంటో ప్రజలకు తెలిసిపోయిందని.. మార్పు పేరుతో జనాన్ని ఏమారుస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. బాన్సువాడ ఉప ఎన్నికల్లో కచ్చితంగా పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఓడిస్తామని చెప్పారు. త్వరలోనే బాన్సువాడలో పార్టీ శ్రేణులతో సమావేశం ఏర్పాటు చేస్తామని కార్యకర్తలకు తెలిపారు. పార్టీని మోసం చేసి నాయకులు వెళ్లిపోయినప్పటికీ కార్యకర్తలు మాత్రం పార్టీని వీడలేదని అభినందించారు. బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే కొండంత అండ కేటీఆర్ మరోమారు స్పష్టం చేశారు. గులాబీ జెండా మీద గెలిచిన వారు పార్టీ వీడినా.. గ్రామాల్లో పార్టీ కార్యకర్తలంతా పార్టీతోనే ఉన్నారని తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter