మెదక్ జిల్లా: జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఆందోల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ రోజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ పొత్తుల అంశాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్, బీజేపీ రహిత దేశమే తమ జాతీయ విధానమన్నారు. కాంగ్రెస్ , బీజేపీలతో జతకట్టాల్సిన ఖర్మ టీఆర్ఎస్ కు పట్టలేదని..ఆ పార్టీలతో జతకట్టే ఆలోచన తమకు లేదని కేసీఆర్ మరోమారు స్పష్టం చేశారు
ఎవరి తొత్తు కాదు..ఎవరితోనూ పొత్తు లేదు
కాంగ్రెస్,బీజేపీ పార్టీలు ఆరోపిస్తున్నట్లు తాము ఎవరో చెప్పిన రహస్య ఎజెండా అమలు చేయడం లేదని..తాము ఎవరికీ తొత్తుగా వ్యవహరించమన్నారు. ప్రజలే తమకుబాస్ అని వారి అజెండాన తమ అజెండా అన్నారు. తాము ప్రజలకు మాత్రమే ఏజెంట్ గా వ్యవరిస్తామని .. టీఆర్ఎస్ పార్టీ ఉన్నంత వరకు ప్రజలతో కలిసినడుస్తామని..వారితో తామ పొత్తు పెట్టుకుంటాని కేసీఆర్ చమత్కించారు.
నరేంద్ర మోడీ ది అట్టర్ ఫ్లాప్ షో..
ఈ సందర్భంగా కేసీఆర్ ..కాంగ్రెస్, బీజేపీ పార్టీ విధానాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రెండు పార్టీలు దొందు దొందేనని..60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ఈ దేశానికి ఏం చేసిందో చెప్పాలన్నారు.. అలాగే ఏదో అద్భుతం చేస్తారనుకున్న మోడీ కూడా పాలనలో అట్టర్ ఫ్లాప్ అయ్యారని కేసీఆర్ ఎద్దేవ చేశారు
మార్పుకు ఫెడలర్ ఒక్కటే మార్గం...
దేశ పరిస్థితి బాగుపడాలంటే మార్పు ఒక్కటే శరణ్యమని.. ఈ మార్పు రాజకీయాలు తెలంగాణ గడ్డ నుంచే మొదలతాయని కేసీఆర్ పేర్కొన్నారు.. ఫెడలర్ ఫ్రంటతోనే దేశంలోమార్పు జరగుతుందన్న కేసీఆర్.. రానున్న రోజుల్లో ప్రాంతీయా పార్టీలదే హవా అని కేసీఆర్ మరోమారు వ్యాఖ్యానించారు