Kadiyam Srihari Pressmeet: మాజీ మంత్రి Etela Rajenderపై కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు

Kadiyam Srihari Pressmeet: నేడు రైతుబంధు ద్వారా రాష్ట్రంలోని లక్షల మంది రైతులకు ఆర్థిక ప్రయోజనం చేకూర్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికి సొంతమన్నారు. నేటి నుంచి వారం లేదా పది రోజులపాటు అర్హులైన రైతులకు రైతుబంధు సాయం అందించడానికి సీఎం కేసీఆర్ చర్యలు తీసుకున్నారు. 

Written by - Shankar Dukanam | Last Updated : Jun 15, 2021, 01:51 PM IST
Kadiyam Srihari Pressmeet: మాజీ మంత్రి Etela Rajenderపై కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు

Kadiyam Srihari Comments On Etela Rajender: అధికార టీఆర్ఎస్ పార్టీకి ఇటీవల గుడ్‌బై చెప్పిన తెలంగాణ ఆర్థికశాఖ మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ బీజేపీలో చేరికపై విమర్శల పర్వం కొనసాగుతోంది. కేవలం తన ఆస్తుల పరిరక్షణ కోసమే ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరినట్లు తాను భావిస్తున్నానని తెలంగాణ మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఆరోపించారు.

హన్మకొండలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం ఆస్తుల పరిరక్షణకు, తన మీద నమోదయ్యే కేసులకు భయపడే బీజేపీ (Etela Rajender Joins BJP)లో చేరారని వ్యాఖ్యానించారు. తనవి వామపక్ష సిద్ధాంతాలని చెప్పుకునే ఈటల రాజేందర్ సిద్ధాంతాలు ఇప్పుడు ఏమయ్యాయని కడియం శ్రీహరి ప్రశ్నించారు. రైతుబంధు పథకం గురించి సైతం ఈటల రాజేందర్ దుష్ప్రచారం చేశారని, కానీ ఆయనకు కూడా రూ.26 లక్షల లబ్ది చేకూరినా వ్యాఖ్యలు చేయడం తదని ఈటలకు సూచించారు.

Also Read: Etela Rajender:ఈటల రాజేందర్ సహా ఇతర బీజేపి నేతలకు తప్పిన విమాన ప్రమాదం ముప్పు

తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ ఏం చేసిందని, ఏం ఉద్ధరించడానికి ఆ పార్టీలో చేరారని ఈటలను ప్రశ్నించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌(Telangana CM KCR)పై మాజీ మంత్రి ఈటల వాడిన పదజాలం సరిగా లేదని, ఇకనైనా పద్ధతి మార్చుకోవాలన్నారు. నేడు రైతుబంధు ద్వారా రాష్ట్రంలోని లక్షల మంది రైతులకు ఆర్థిక ప్రయోజనం చేకూర్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికి సొంతమన్నారు. నేటి నుంచి వారం లేదా పది రోజులపాటు అర్హులైన రైతులకు రైతుబంధు సాయం అందించడానికి సీఎం కేసీఆర్ చర్యలు తీసుకున్నారు. 

Also Read: Telangana rains: రాష్ట్రంలో మరో మూడు రోజులు వర్షాలు.. GHMC రివ్యూ 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News