Konda Surekha: పిచ్చికుక్క కరిస్తే మాట్లాడినట్లు.. కొండా సురేఖపై కేఏ పాల్ హాట్ కామెంట్స్

KA Paul Fires on Konda Surekha: మంత్రి కొండా సురేఖపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆమె 72 గంటల్లో రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నాగార్జున సమంత ఇంటికి వెళ్లి క్షమాపణలు చెప్పాలని కోరారు.  

Written by - Ashok Krindinti | Last Updated : Oct 3, 2024, 12:35 PM IST
Konda Surekha: పిచ్చికుక్క కరిస్తే మాట్లాడినట్లు.. కొండా సురేఖపై కేఏ పాల్ హాట్ కామెంట్స్

KA Paul Fires on Konda Surekha: అక్కినేని నాగచైతన్య, సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీలో.. అటు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నట్లు కొండా సురేఖ తెలిపారు. అయితే ఈ మంట ఇంకా చల్లరడం లేదు. తాజాగా మంత్రి వ్యాఖ్యలపై ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్రస్థాయి విరుచుకుపడ్డారు. కొండా సురేఖ వ్యాఖ్యలు మతిభ్రమించి, పిచ్చికుక్క కరిస్తే మాట్లాడినట్టు ఉన్నాయంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఆమె మాటలు చట్టవిరుద్ధం అని.. ఇదే అమెరికా అయితే మిలియన్ డాలర్ల పరువు నష్టం దావా వేస్తారని అన్నారు.

Also Read: Akkineni Vs Congress: కాంగ్రెస్ కు అక్కినేని ఫ్యామీలీనే ఎందుకు టార్గెట్.. ?

రాహుల్ గాంధీ ఒక కామెంట్‌తో పార్లమెంట్ సభ్యత్వమే పోగొట్టుకోవాల్సి వచ్చిందని.. ఆయన వ్యాఖ్యలతో పోల్చితే కొండా సురేఖ వ్యాఖ్యలు 100 రెట్లు అభ్యంతరకరంగా ఉన్నాయని కేఎ పాల్ మండిపడ్డారు. మంత్రికి నోటీసులు ఇచ్చి డీజీపీ ఎందుకు అరెస్టు చేయలేదు..? అని ప్రశ్నించారు. ఇప్పుడు హత్య చేసి సారీ చెప్పినట్లు ఉందని అన్నారు. సమంతకు ఎంత మనోవేదన, ఆవేదన ఉంటాయో ఊహించారా..? అని అడిగారు. కొండా సురేఖకు 72 గంటల సమయం ఇస్తున్నానని.. ఆలోపు రాజీనామా చేయాలని డిమాండ చేశారు. తక్షణమే రాహుల్ గాంధీ స్పందించి.. తొలగించాలన్నారు. సమంత ఇంటికి నాగార్జున వెళ్లి క్షమాపణలు కోరాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి గర్వం ఎక్కువై నేతలు ఇలా మాట్లాడుతున్నారని.. కళ్లు నెత్తిమీద ఉన్నాయన్నారు.

ప్రజలకు కూడా బుద్ధి లేదని.. రూ.5 వేలు తీసుకుని ఓట్లు వేస్తున్నారని కేఏ పాల్ అన్నారు. ఆలోచనతో ఓటు వేసి కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని ఓటర్లను కోరారు. కాంగ్రెస్‌ను వద్దంటే మళ్లీ కేసీఆర్, కేటీఆర్‌ అంటున్నారని.. మళ్లీ వాళ్లే ఎందుకు అని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలంటే.. ప్రజాశాంతి పార్టీని గెలిపించాలని కోరారు. లేదంటే ప్రజలే నష్టపోతారని..  60 శాతం ప్రజలు ఉన్న బీసీలకు తానున్నానని హామీ ఇచ్చారు. తనతో క్రిస్టియన్ మైనారిటీలు ఎలాగూ ఉన్నారని అన్నారు. 72 గంటల్లో రాజీనామా చేయకపోతే కొండా సురేఖపై కేసు దాఖలు చేస్తానని హెచ్చరించారు. ఆమె రాజీనామా చేసినా.. పదవి నుంచి తొలగించినా.. తనకు ఒక కేసు మిగులుతుందన్నారు. హైడ్రాతో వ్యతిరేకత వస్తుండడంతో ప్రజల దృష్టిమళ్లించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఈ కామెంట్స్ చేయించారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. 

Also Read: Telangana Government: మూసీ నిర్వాసితులకు మరో బంపర్‌ ఆఫర్.. డబుల్‌ బెడ్‌రూం ఇళ్లతోపాటు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x