K Kavitha: తుపాకీ గురిపెట్టిన రేవంత్ రెడ్డి తీరుతో తెలంగాణ తల్లి కన్నీళ్లు

K Kavitha Key Comments Revanth Reddy Rude Ruling: తెలంగాణలో విగ్రహం మార్పు అంశం తీవ్ర దుమారం రేపుతోంది. రేవంత్‌ రెడ్డి ఇష్టారీతిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఎమ్మెల్సీ కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Dec 9, 2024, 04:13 PM IST
K Kavitha: తుపాకీ గురిపెట్టిన రేవంత్ రెడ్డి తీరుతో తెలంగాణ తల్లి కన్నీళ్లు

Telangana Thalli: మార్పు పేరిట కాంగ్రెస్‌ పార్టీ, రేవంత్‌ రెడ్డి చేస్తున్న విధ్వంసంతో తెలంగాణ తల్లి కన్నీళ్లు పెడుతోందని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ, భారత్‌ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఇష్టారీతిన విగ్రహం మార్చడం సరికాదన్నారు. తెలంగాణ తల్లికి నివాళులర్పించే అర్హత అతడికి లేదని ప్రకటించారు. తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ గురి పెట్టిన రేవంత్‌ రెడ్డి గన్‌పార్క్‌ వద్ద అమరవీరుల స్తూపం ముందు ముక్కు నేలకు రావాలని డిమాండ్‌ చేశారు.

Also Read: KTR: ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ తరపున అసెంబ్లీలో రేవంత్‌ రెడ్డిని ప్రశ్నిస్తాం.. నిలదీస్తాం

రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, తెలంగాణ తల్లి విగ్రహ మార్పుపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 'ఎక్స్‌' వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా రేవంత్‌ తీరుపై దుమ్మెత్తిపోశారు. ' రేవంత్ రెడ్డి దుశ్చర్యతో తెలంగాణ తల్లి కన్నీళ్లు పెడుతోంది. తెలంగాణ తల్లిని కాంగ్రెస్ తల్లిగా మార్చారు. తెలంగాణ తల్లి నుంచి బతుకమ్మను మాయం చేశారు. మన తెలంగాణ ప్రత్యేకత లేకుండా చేశారు. తెలంగాణ తల్లికి నివాళులర్పించే అర్హత రేవంత్ రెడ్డికి లేదు' అని స్పష్టం చేశారు. 'తెలంగాణ తల్లికి నివాళులర్పించే ముందు ఉద్యమకారుల మీద తుపాకీ గురి పెట్టిన రేవంత్ రెడ్డి గన్ పార్క్ వద్ద ముక్కు నేలకు రాయాలి' అని ఎమ్మెల్సీ కవిత డిమాండ్‌ చేశారు.

Also Read: KTR Harish Rao Arrest: రేవంత్‌ రెడ్డి నీ పిట్ట బెదిరింపులకు భయపడం.. ప్రశ్నిస్తే కేసులా?

ఆశవర్కర్ల అరెస్ట్‌పై హరీశ్‌ రావు ఆగ్రహం
'ఒకవైపు తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు చేస్తున్నమని గొప్పలు చెబుతూ.. మరో వైపు క్షేత్రస్థాయిలో విశిష్ట సేవలందించే ఆశా తల్లులపై దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆశా వర్కర్ల వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పిస్తామని అభయహస్తం మేనిఫెస్టోలో హామీ ఇచ్చి ఇప్పుడు అమలుచేయకపోతే ఎలా అని ప్రశ్నించారు. హామీ అమలు చేయాలంటూ అశా అక్కా చెల్లెళ్లు రోడ్డెక్కితే పోలీసులతో ఇష్టారీతిన కొట్టించడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలకు సేవలందించే ఆశా వర్కర్లకు నిరసించే హక్కు లేదా అని ప్రశ్నించారు. సమస్యలు పరిష్కరించాలని అడిగే స్వేచ్చ లేదా అని నిలదీశారు. ప్రశ్నిస్తే పోలీసులతో పళ్లూడగొట్టించే దుర్మార్గ వైఖరిని అవలంబిస్తూ, ఆశాల ఆశలపై నీళ్లు చల్లుతుండటం సిగ్గుచేటు అని తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News