Digital Health Profile Card: తెలంగాణ ప్రజలకు డిజిటల్‌ హెల్త్‌ కార్డు: సీఎం రేవంత్‌ రెడ్డి నిర్ణయం

Telangana Health Profile Card: తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్‌ రెడ్డి క్రమంగా పాలనపై దృష్టి సారించారు. ఈ క్రమంలో వైద్యారోగ్య శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించి ఆయా శాఖలకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jan 29, 2024, 08:40 PM IST
Digital Health Profile Card: తెలంగాణ ప్రజలకు డిజిటల్‌ హెల్త్‌ కార్డు: సీఎం రేవంత్‌ రెడ్డి నిర్ణయం

Health Profile Card: అధికారంలోకి వచ్చాక వరుస సమీక్షలు చేస్తున్న ముఖ్యమంత్రి తాజాగా వైద్యారోగ్య శాఖపై సమీక్ష జరిపారు. ఈ క్రమంలో ప్రధానంగా ఆరోగ్యశ్రీపై చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆస్పత్రుల నిర్మాణం,  వైదారోగ్య సేవలపై రేవంత్‌ రెడ్డి అధికారులతో మాట్లాడారు. పలు విషయాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులకు ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డును ఒక  యూనిక్ నంబర్‌తో అనుసంధానం చేయాలని సూచించారు. ఆ కార్డుతో ఆరోగ్యశ్రీని అనుసంధానం చేయాలని చెప్పారు.

ఆరోగ్య శ్రీ ద్వారా వైద్య సేవలు పొందేందుకు తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి అనే నిబంధన సడలింపుపై పరిశీలించాలని సీఎం అధికారులకు చెప్పారు. ఈ నిబంధన కారణంగా ఆరోగ్యశ్రీ కార్డు కోసం తెల్ల రేషన్ కార్డు తీసుకునే వారి సంఖ్య పెరుగుతోందన్నారు. వైద్య కళాశాల ఉన్న ప్రతీ చోట నర్సింగ్, ఫిజియోథెరపీ, పారా మెడికల్ కళాశాలలు ఉండాలని, దీనికోసం కొత్త విధానం తీసుకురావాలని ఆదేశించారు.

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో శంకుస్థాపన చేసిన వరంగల్, ఎల్బీ నగర్, సనత్ నగర్, అల్వాల్‌లో టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణాలపై వివరాలు తెలుసుకున్న సీఎం వెంటనే నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు. వైద్యుల కొరత రాకుండా చూసుకోవాలని, దీనికోసం వైద్య కళాశాలలను ఆస్పత్రులకు అనుసంధానించాలని చెప్పారు. తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో వైద్య, నర్సింగ్ కళాశాల ఏర్పాటును పరిశీలించాలని సూచించారు.

బీబీనగర్ ఎయిమ్స్‌లో పూర్తిస్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువస్తే ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని సీఎం తెలిపారు. ఉస్మానియా, నిమ్స్ ఆస్పత్రులపై భారం తగ్గేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వైద్యం కోసం ప్రజలుఏ హైదరాబాద్‌పై ఆధారపడకుండా ఎక్కడికక్కడ వైద్య సదుపాయాలు కల్పించాలన్నారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి సీఎం సమీక్షించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో హౌస్ కీపింగ్ నిర్వహణ బాధ్యతను పెద్ద కంపెనీలు చేసేలా చూడాలన్నారు.

ఆరోగ్యశ్రీ బిల్లులు బకాయి వద్దు
ప్రతి నెల ప్రభుత్వ ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ బిల్లులు విధిగా విడుదల చేయాలని సీఎం ఆదేశించారు. ప్రయివేటు ఆసుపత్రుల ఆరోగ్యశ్రీ బిల్లులను మూడు నెలలకోసారి విడుదల చేసేలా ఒప్పందం కుదుర్చుకోవాలని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రులతోపాటు బోధానాస్పత్రుల ఆరోగ్యశ్రీ బిల్లులు రూ.270 కోట్లు వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. జూనియర్ డాక్టర్స్, ఆశా కార్యకర్తలు, స్టాఫ్ నర్సుల జీతాలతోపాటు 108, 102 సేవల పనితీరుపై అధికారులతో సీఎం సమీక్షించారు.

Also Read: Mother Emotional Letter: కన్నా ప్రపంచంలోనే అత్యుత్తమ కొడుకివి నువ్వే రా.. కన్నీళ్లు తెప్పిస్తున్న తల్లి లేఖ

Also Read: RS Elections: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. తెలుగు రాష్ట్రాల్లో 6 స్థానాలకు ఎన్నిక

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News