న్యాయస్థానానికి మరికొంత గడువు కోరిన ఇంటర్ బోర్డు; విచారణ వాయిదా

ఇంటర్ బోర్డు వివాదంపై న్యాయస్థానంలో విచారణ కొనసాగుతోంది

Last Updated : May 8, 2019, 04:57 PM IST
న్యాయస్థానానికి మరికొంత గడువు కోరిన ఇంటర్ బోర్డు; విచారణ వాయిదా

ఇంటర్‌ వివాదంపై ఈ రోజు హైకోర్టులో మళ్లీ విచారణ జరిగింది. రీవెరిఫికేషన్ అంశంపై ఇంటర్ బోర్డును న్యాయస్థానం  ప్రశ్నించగా.. ఫలితాల రీవెరిఫికేషన్‌ కొనసాగుతోందని ఇంటర్‌ బోర్డు హైకోర్టుకు వివరించింది. అలాగే రీవెరిఫికేషన్‌ పూర్తి వివరాల వెల్లడికి మరికొంత గడువు కోరింది. దీంతో ఈ కేసు తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 15కు వాయిదా వేసింది

ఇంటర్‌ ఫలితాల్లో భారీగా తప్పులు దొర్లాయని విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు ఇప్పటికే ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఆందోళన నేపథ్యంలో దీనిపై నిజనిర్ధారణ కోసం ప్రభుత్వం త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసింది.

ఈ క్రమంలో త్రి సభ్య కమిటీ తమ నివేదికలో పలు సూచనలు చేసింది. దాని ఆధారంగా ఫెయిలైన విద్యార్థులందరి పరీక్ష పత్రాలు ఉచితంగా రీ వెరిఫికేషన్‌ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. కాగా గ్లోబరీనా సంస్థను కేసుల్లో ప్రతివాదులుగా చేర్చాలని బాలల హక్కుల సంఘం డిమాండ్ చేస్తోంది
 

Trending News