Lagacharla Farmer: తెలంగాణ పోలీసులు మరో దారుణం.. బేడీలతోనే లగచర్ల రైతు ఆస్పత్రికి తరలింపు

Lagacharla Farmer Heart Attack: జైలులో గుండెపోటుకు గురయిన లగచర్ల రైతును సంకెళ్లతో ఆస్పత్రికి తరలించడం తెలంగాణలో సంచలనం రేపింది. రాజకీయంగా తీవ్ర దుమారం రేపగా.. రేవంత్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Dec 12, 2024, 03:35 PM IST
Lagacharla Farmer: తెలంగాణ పోలీసులు మరో దారుణం.. బేడీలతోనే లగచర్ల రైతు ఆస్పత్రికి తరలింపు

Lagacharla Farmer Hand Cuffs: తెలంగాణలో లగచర్ల రైతుల పోరాటం తీవ్ర రాజకీయ పరిణామాలకు దారి తీసిన విషయం తెలిసిందే. అయితే అధికారులపై దాడికి పాల్పడ్డారనే ఆరోపణలతో ఆ గ్రామ రైతులను అరెస్ట్‌ చేసి జైలులో ఉంచిన విషయం తెలిసిందే. వారికి సంబంధించి కేసు విచారణలో ఉంది. అయితే దాడి నెపంతో అమాయక రైతులపై పోలీసులు క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికే లగచర్లలో బీభత్సం సృష్టించిన పోలీసులు తాజాగా మరో దారుణానికి పాల్పడ్డారు. అనారోగ్యానికి గురయిన లగచర్ల రైతును బేడీలతోనే ఆస్పత్రికి తరలించడం సంచలనంగా మారింది. పోలీసుల చర్య రాజకీయ దుమారం రేపింది. ఆ వ్యవహారంపై బీఆర్‌ఎస్‌ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేయగా.. ప్రతిపక్షాలు మండిపడుతుండడంతో ముఖ్యమంత్రి స్పందించి సంబంధిత పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం.

Also Read: One Election: మోదీ ప్రభుత్వం సంచలనం.. జమిలి ఎన్నికలకు ఆమోదం

వికారాబాద్‌ జిల్లాలోని రేవంత్‌ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లోని లగచర్లలో ఫార్మా విలేజ్‌ ఏర్పాటుపై తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఆ సమయంలో రైతులు తీవ్రంగా వ్యతిరేకించిన సమయంలో అధికారులను ఘెరావ్‌ చేశారు. అధికారులపై దాడికి పాల్పడ్డారనే కారణంతో అమాయక రైతులను అరెస్ట్‌ చేశారు. కొందరు సంగారెడ్డి రెడ్డి జైలులో ఉండగా.. మరికొందరు ఇతర జైళ్లల్లో ఉన్నారు. తాజాగా అరెస్టయిన రైతుల్లో ఇద్దరు అనారోగ్యానికి గురయ్యారు. సంగారెడ్డి జైల్లో ఉన్న లగచర్ల రైతు హీర్యా నాయక్‌కు గుండె నొప్పి వస్తే ఆ సమాచారం బయటకు రాకుండానివ్వకుండా ఆస్పత్రికి తరలించారు.

Also Read: YCP India Alliance: ఇండియా కూటమిలో వైసీపీ, మమత నాయకత్వానికి మద్దతు

రేవంత్‌ రెడ్డి ఆగ్రహం
లగచర్ల రైతు హీర్యా నాయక్‌ను చికిత్స కోసం సంగారెడ్డి ఆసుపత్రికి బేడీలతో తీసుకెళ్లడంపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అధికారులను సీఎం ఆరా తీశారని సమాచారం. రైతుకు బేడీలు వేసి తీసుకెళ్లాల్సినంత అవసరం ఏమొచ్చిందని అధికారులను నిలదీసినట్లు తెలుస్తోంది. ఘటనపై  విచారణ జరిపి పూర్తి నివేదిక సమర్పించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రజా ప్రభుత్వం ఇలాంటి చర్యలను సహించదని హెచ్చరించారని సీఎంఓ వర్గాలు వెల్లడించాయి. ఈ వ్యవహారంపై బీఆర్‌ఎస్‌ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌, హరీశ్ రావుతోపాటు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తదితరులు ఈ సంఘటనను ఖండించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News