Meta Jobs: ఫేస్‌బుక్‌లో ఉద్యోగం అని కెనడా వెళ్లాడు.. 2 రోజులకే వద్దుపో అన్నారు.. ఐఐటి గ్రాడ్యూయేట్ ధీనగాథ

Meta Jobs Layoffs: మెటా సంస్థలో ఉద్యోగంలో చేరి ఒక రోజు గడిచిపోయింది. ఆ రోజంతా ఆఫీసులో కొలీగ్స్ తో పరిచయాలు, పలకరింపులతోనే సరిపోయింది. రెండో రోజు రానే వచ్చింది... జీవితం ఇక హాయిలే అనుకుంటున్న సమయంలో మెగా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ ఆఫీసులో ఓ పెద్ద బాంబు పేల్చాడు.

Written by - Pavan | Last Updated : Nov 12, 2022, 06:51 AM IST
Meta Jobs: ఫేస్‌బుక్‌లో ఉద్యోగం అని కెనడా వెళ్లాడు.. 2 రోజులకే వద్దుపో అన్నారు.. ఐఐటి గ్రాడ్యూయేట్ ధీనగాథ

Meta Jobs Layoffs: ఐఐటి ఖరగ్‌పూర్‌లో గ్రాడ్యూయేషన్ పూర్తి చేశాడు. ఫేస్‌బుక్ పేరెంట్ కంపెనీ మెటాలో మంచి ఉద్యోగం కూడా వచ్చింది. కాకపోతే పోస్టింగ్ కెనడాలో వచ్చింది. అయినా సరే మెటాలో ఉద్యోగం కదా జీవితానికి ఇక డోకా ఏముంటుందని భావించి ఉద్యోగంలో చేరడానికి సిద్ధపడ్డాడు. ఇంటా బయట అందరికీ ఈ గుడ్ న్యూస్ చెప్పి కెనడాకు బయల్దేరాడు. కెనడాకు మకాం మార్చడం అంత సులువైన వ్యవహారమేమీ కానప్పటికీ.. మెటా ఉద్యోగం ఉంది కదా అన్న ధైర్యంతో వీసా, పాసుపోర్ట్ తీసుకుని ఏం చక్కా కెనాడాకు చెక్కేశాడు. ఎన్నో ఆశలతో కెనడాలో అడుగుపెట్టాడు. మెటా కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. 

మెటా సంస్థలో ఉద్యోగంలో చేరి ఒక రోజు గడిచిపోయింది. ఆ రోజంతా ఆఫీసులో కొలీగ్స్ తో పరిచయాలు, పలకరింపులతోనే సరిపోయింది. రెండో రోజు రానే వచ్చింది... జీవితం ఇక హాయిలే అనుకుంటున్న సమయంలో మెగా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ ఆఫీసులో ఓ పెద్ద బాంబు పేల్చాడు. మెటా కంపెనీలో 11 వేల మందిని ఉద్యోగంలోంచి తొలగిస్తున్నట్టు మార్క్ జుకర్ బర్గ్ చేసిన ప్రకటన భూకంపం రాకుండానే అతడి కాళ్ల కింద భూమి కంపించేలా చేసింది. 

తాను జాయిన్ అయ్యి రెండు రోజులే అయ్యింది కదా.. మార్క్ జుకర్ బర్గ్ సాగనంపించిన ఆ 11 వేల మంది ఉద్యోగుల జాబితాలో తానుండను అనుకున్నాడు. సరే ఎంతయినా మంచిది ఒకసారి మెయిల్ చెక్ చేసుకుందాం అని మెయిల్ ఓపెన్ చేశాడు. అంతే.. జీవితానికి సరిపడ షాకిచ్చాడు మార్క్ జుకర్ బర్గ్. మెటాలో ఉద్యోగం కోల్పోయిన వారిలో తానూ ఒకడినని అప్పుడే అర్థమైంది. ఉద్యోగంలో చేరిన రెండు రోజులకే ఉద్యోగం కోల్పోవడం ఎవరికైనా జీవితానికి సరిపడ షాకే కదా మరి. మెటాలో ఉద్యోగం కోల్పోయిన తీరు గురించి లింక్‌డ్ ఇన్ పోస్టులో తన కథను రాసుకున్న ఆ యువకుడి పేరు హిమాన్షు. భవిష్యత్తులో తనకు ఇంకా ఏం రాసిపెట్టి ఉందోనని హిమాన్షు బెంబేలెత్తిపోతున్నాడు.

 Also Read : Meta Fired 11000 employees: మెటాలో 11 వేల మంది ఉద్యోగుల తొలగింపుపై మార్క్ జుకర్‌బర్గ్ స్పందన

Also Read : Twitter India: ఉద్యోగులకు కోలుకోలేని షాక్.. భారీ సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News