KTR: రేవంత్‌ రెడ్డి అవినీతి బట్టలు విప్పి నగ్నంగా నిలబెడతా: కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

KTR Alleges Revanth Reddy Trio Corruption: కాంగ్రెస్‌ వచ్చాక తెలంగాణను దోచుకుంటున్నారని.. రేవంత్ రెడ్డి, అతడి మంత్రులు కలిసి రాష్ట్రాన్ని ఇష్టారాజ్యంగా పంచేసుకుంటున్నారని మాజీ మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌ రెడ్డి, అతడి మంత్రుల అవినీతి బట్టలు విప్పి నగ్నంగా నిలబెడతానని సంచలన ప్రకటన చేశారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Nov 6, 2024, 01:46 PM IST
KTR: రేవంత్‌ రెడ్డి అవినీతి బట్టలు విప్పి నగ్నంగా నిలబెడతా: కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

Telangana Bhavan: కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక తెలంగాణ ప్రజా సొమ్మును ముఖ్యమంత్రి, మంత్రులు దోచుకుంటున్నారని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేకుల్లాగా కోసుకుని పంచేసుకుంటున్నారంటూ ఆరోపించారు. రేవంత్‌ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి కలిసి భారీ కుంభకోణాలకు పాల్పడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజల ముందుకు వాస్తవాలు చెబుతానని.. కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్‌ అవినీతిపై ఏం చేస్తుందని ప్రశ్నించారు.

Also Read: Rahul Gandhi: బావర్చీ హోటల్లో రాహుల్‌ గాంధీ కోసం బిర్యానీ వెయిటింగ్‌.. వైరల్ వీడియో

రాష్ట్రంలో వెలుగులోకి వస్తున్న కుంభకోణాలు, అవినీతిపై బుధవారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి కేటీఆర్‌ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గోదావరి జలాలు, కొడంగల్‌ ఎత్తిపోతల పథకం వంటి వాటిపై ఆధారాలతో సహా అవినీతిని బయటపెట్టారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. 'సాగునీటి రంగంలో కేసీఆర్ ఎంతో గొప్పగా పనిచేశారు. దేశంలో ఎవరూ చేయని విధంగా కాళేశ్వరం కట్టారు. వాయు వేగంతో తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులు కేసీఆర్ నిర్మించారు' అని కేటీఆర్‌ గుర్తుచేశారు.

Also Read: KTR: సెక్యూరిటీ లేకుండా వస్తే రేవంత్‌ రెడ్డిని ప్రజలు తన్నే పరిస్థితి

'రేవంత్‌ రెడ్డి తీరు రోజుకో మాట ఉంటుంది. ప్రతిపక్ష నాయకుడిగా.. ముఖ్యమంత్రిగా మాట్లాడి దానికి విరుద్ధంగా పనులు చేస్తున్నాడు. మేఘా ఇంజనీరింగ్ సంస్థను ఈస్ట్ ఇండియా కంపెనీ అని తిట్టిపోసిన రేవంత్‌ రెడ్డి ఇప్పుడు ఆ కంపెనీపై చర్యలు తీసుకోకుండా కాంట్రాక్టులు ఎందుకు అప్పగిస్తున్నారు?' అని కేటీఆర్‌ నిలదీశారు. 'హైదరాబాద్‌కు నీళ్లు తెచ్చేందుకు సుంకిశాల ప్రాజెక్ట్ చేపడితే రేవంత్‌ ప్రభుత్వం పట్టించుకోలే. సుంకిశాలలో మేఘా కంపెనీ తీవ్ర నిర్లక్ష్యం కారణంగా కూలిపోతే ఎలాంటి చర్యలు తీసుకోలేదు' అని వివరించారు.

సుంకిశాల ఘటనలో మేఘా సంస్థను బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని కమిటీ రిపోర్ట్ ఇస్తే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మాజీ మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. దొంగలు, దొంగలు కలసి ఊళ్లు పంచుకున్నట్లు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మేఘా సంస్థకు రాష్ట్రంలోని ప్రాజెక్టులను కట్టబెడుతున్నారు. సుంకిశాల ప్రాజెక్ట్ విషయంలో మేఘా సంస్థపై చర్యలు తీసుకొని కాంట్రాక్ట్ రద్దు చేయాలి' అని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా పెద్ద కుంభకోణమేనని సంచలన ఆరోపణలు చేశారు.

ఎల్ అండ్ టీ, ఎన్సీసీని కాదంటూ టెక్నికల్ బిడ్‌లో అనర్హత చేసి మేఘా, పొంగులేటికి చెందిన రాఘవ సంస్థకు మొత్తం పనులను రెండు కేకుల మాదిరిగా ముక్కలు ఇచ్చారని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ తెలిపారు. మేఘా సంస్థతో కుమ్మక్కై డబ్బులు దండుకునే కుట్ర చేస్తున్నావంటూ రేవంత్‌పై ఆరోపణలుచేశారు. 'కొడంగల్ ఎత్తిపోత పథకం రూ.4,350 కోట్లలో నీ వాటా ఎంత? ఢిల్లీ వాటా ఎంత?' అని కేటీఆర్‌ సూటిగా ప్రశ్నించారు.

'మూసీ ప్రాజెక్ట్ కోసం ఆగమేఘాల మీద పనులు చేసే కుట్ర చేస్తున్నారు. దానిని మేఘాకు ఇవ్వడానికి అన్ని సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే  మహారాష్ట్రకు మూటలు పోయాయి. ఢిల్లీకి కూడా ఈ కంపెనీ ద్వారా మూటలు పంపిస్తారు. కుంభకోణాలను ముందే ప్రజలకు వివరిస్తున్నా' అని కేటీఆర్‌ తెలిపారు. 'రేవంత్ రెడ్డి సహాయ మంత్రి బండి సంజయ్ ఎందుకు మాట్లాడటం లేదు' అని సందేహం వ్యక్తం చేశారు.

'మోడీ వేరే రాష్ట్రాల్లో తెలంగాణ గురించి మాట్లాడతాడు. కానీ ఇక్కడ ఎలాంటి చర్యలు ఉండవు. బావమరదికి అమృత్ టెండర్లు, మేఘా, రాఘవ సంస్థలకు ప్రాజెక్ట్‌లను రేవంత్ రెడ్డి పంచుతున్నాడు. ఈ దేశంలో చట్టాలు ఉన్నాయా? ఇంత బహిరంగంగా దోపిడీ చేస్తుంటే ఈడీ లు విజిలెన్స్ లు ఏం చేస్తున్నాయి?' అని కేటీఆర్‌ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి, మేఘా కృష్ణారెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. ఈ బీజేపీ, కాంగ్రెస్ నాయకుల బాగోతాలను బట్టలిప్పి ప్రజల ముందు నగ్నంగా నిలబెడతామని కేటీఆర్‌ స్పష్టం చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News