Walk Way: చారిత్రక నగరానికి మరో శోభ, హుస్సేన్ సాగర్‌పై వాక్ వే నిర్మాణం

Walk Way: చారిత్రాత్మక హైదరాబాద్ నగరంలో మరో అద్భుతం సాక్షాత్కారం కానుంది. హుస్సేన్ సాగర్‌లోని బుద్దుడి విగ్రహం ఠీవికి వన్నె తెచ్చే కట్టడం నిర్మితం కానుంది. అదేంటో చూద్దాం.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 22, 2022, 06:25 AM IST
 Walk Way: చారిత్రక నగరానికి మరో శోభ, హుస్సేన్ సాగర్‌పై వాక్ వే నిర్మాణం

Walk Way: చారిత్రాత్మక హైదరాబాద్ నగరంలో మరో అద్భుతం సాక్షాత్కారం కానుంది. హుస్సేన్ సాగర్‌లోని బుద్దుడి విగ్రహం ఠీవికి వన్నె తెచ్చే కట్టడం నిర్మితం కానుంది. అదేంటో చూద్దాం.

హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ చుట్టూ విస్తరించిన నగరంలో ఎన్నో చారిత్రాత్మక కట్టడాలు, మరెన్నో అద్భుత నిర్మాణాలు. నగరాన్ని అనునిత్యం పరిశీలిస్తున్నట్టుగా కన్పించే ప్రశాంతమైన బుద్దుడి విగ్రహం. ఇటీవలి కాలంలో నిర్మితమవుతున్న కొత్త కొత్త కట్టడాలు హైదరాబాద్ నగరానికి మరిన్ని సొగసులు అద్దుతున్నాయి. పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు మరో అద్భుత కట్టడం త్వరలో నిర్మాణం కానుంది. నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ అందాన్ని పెంచే సుందర నిర్మాణానికి  అంకురార్పణ జరిగింది.

హుస్సేన్ సాగర్‌పై (Hussain Sagar)కొంతవరకూ నడిచి వెళ్లి...నది అందాన్ని పై నుంచి వీక్షించేలా..బుద్ధుడి ఠీవిని మరింత చేరువగా చూసేలా అద్భుతమైన వాక్ వే నిర్మితం కానుంది. జీహెచ్ఎంసీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ స్వయంగా ఈ విషయాన్ని ట్విట్ చేశారు. ఈ నిర్మాణం ప్రజలకు కచ్చితంగా ఓ మంచి అనుభూతిని ఇవ్వనుంది. నెక్లెస్ రోడ్డులోని పీవీ నరశింహారావు మార్గ్ వద్ద ఈ నిర్మాణం చేపట్టనున్నారు. 2022 ఏడాది చివరి నాటికి ఈ కొత్త వాక్ వే (Walk Way)అందుబాటులో రావచ్చని తెలుస్తోంది.

Also read: Mood Of The Nation poll: ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలొస్తే.. బీజేపీకి ఎన్ని సీట్లోస్తాయంటే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News