Khairatabad: సప్త ముఖ మహాశక్తి రూపంలో ఖైరతాబాద్ గణపయ్య... ఈసారి విశిష్టత ఏంటో తెలుసా..?

Hyderabad:  ఖైరతాబాద్ గణపయ్య వందల ఏళ్ల నుంచి కూడా భక్తులతో పూజలందుకుంటున్నాడు. ప్రతి ఏడాది కూడా ఏదో ఒక కొత్తదనంతో భక్తులు ముందుకు వస్తున్నాడు.ఈసారి ఖైరతాబాద్ గణపయ్యను.. సప్తముఖ మహశక్తి రూపంలో  తయారు చేస్తున్నట్లు ఉత్సవ కమిటీ వెల్లడించింది.

Last Updated : Jul 9, 2024, 12:54 PM IST
  • ఖైరతాబాద్ లో వినూత్న రీతిలో విగ్రహం..
  • ప్రముఖ సిద్ధాంతి సూచనలే కారణం..
Khairatabad: సప్త ముఖ మహాశక్తి రూపంలో ఖైరతాబాద్ గణపయ్య... ఈసారి విశిష్టత ఏంటో తెలుసా..?

Hyderabad khairatabad Vinayaka as sapthamukha mahashakti Ganapati: దేశంలో పండుగ వాతావరణం స్టార్ట్ అయ్యింది. ఇప్పటికే ఆషాడమాసం ప్రారంభం కావడంతో ఒకవైపు బోనాల సందడి నడుస్తోంది. నెల రోజుల పాటు తెలంగాణలో బోనాల పండుగ జరుగనుంది. ఇప్పటికే గోల్కొండలో తొలిబోనం సమర్పించి, బోనాలకు అంకురార్పణ చేశారు.    ఆ తర్వాత బల్కంపేట ఎల్లమ్మ, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి, ఓల్డ్ సిటీ ఇలా వరుసగా బోనాలు నిర్వహిస్తారు. ఇదిలా ఉండగా.. మరోవైపు వినాయక చవితికి కూడా ఏర్పాట్లు జోరుగా నడుస్తున్నాయి. ఈ క్రమంలో..ఇప్పటికే ఖైరతాబాద్ గణపయ్యకు కర్రపూజ కార్యక్రమం గతంలోనే పూర్తయింది. విగ్రహాల ఏర్పాటు కూడా దాదాపుగా పూర్తికావస్తుంది.

Read more: Snake: పిల్లపామే కదా అని నోట్లో వేసుకున్నాడు.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా.?.. వీడియో వైరల్..

ఈ సారి గణపయ్య ను..  సప్తముఖ మహాశక్తి గణపతిగా, ఖైరతాబాద్ మహా గణపతి భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు ప్రధాన శిల్పి చినస్వామి రాజేంద్రన్‌తో పాటు నిపుణులైన వెల్డింగ్‌ కళాకారులు ఇప్పటికే పనుల్లో స్పీడ్ ను పెంచారు. ఇదిలా ఉండగా.. గతంలోనూ సప్తముఖ మహా గణపతిని తయారు చేశారు. ఈ ఏడు కాలమానం ప్రకారం ప్రపంచ శాంతితో పాటు సర్వజనులకు ఆయురారోగ్యాలు కలిగేలా గణపతిని సప్తముఖాలతో పూజించాలని ప్రముఖ దివ్యజ్ఞాన సిద్ధాంతి గౌరీభట్ల విఠల శర్మ సూచించారు. ఆయన సూచనలకు అనుగుణంగా ఈసారి సప్తముఖాలతో గణపయ్యను తయారు చేస్తున్నట్లు ఉత్సవకమిటీ వెల్లడించారు.

గౌరీభట్ల సిద్ధాంతి సూచనల మేరకు..  ఉత్సవ కమిటీ, ప్రధాన శిల్పి రాజేంద్రన్‌ గణపతి రూపాన్ని ఈ విధంగా మలిచేలా నిర్ణయించుకున్నారు. అదే విధంగా ఈసారి వినాయక చవితి సెప్టెంబరు 7వ తారీఖున వస్తుంది. దీనితో పాటు.. వారంలోని చివరి (7వ) రోజు శనివారం వచ్చింది. దీంతో పాటు 70 సంవత్సరాల ఉత్సవాలు జరుపుకుంటున్న తరుణంలో యాధృచ్చికంగా సప్తముఖ మహాగణపతిని తయారు చేస్తుండడం విశేషమే అవుతుందని ఆచార్య విఠలశర్మ సూచించారు.

అదే విధంగా.. 7 తలలు, 14 చేతులు, తలలపై నాగసర్పాలతో పీఠాన్ని కలుపుకొని 70 అడుగుల ఎత్తుతో వినాయకుడిని భారీ ఆకారంతో రూపొందిస్తున్నట్లు శిల్పి ఒక ప్రకటనలో వెల్లడించారు. గతంలో తయారైన సప్తముఖ గణపతి ఆకారానికి పూర్తి భిన్నంగా ఈసారి గణపతిని తయారు చేస్తామని శిల్పిపేర్కొన్నారు. నమూనా చిత్రాన్ని ఈనెల 17న విడుదల చేస్తున్నట్లు ఉత్సవ కమిటీ ఒక ప్రకటలో వెల్లడించింది. ఇదిలా ఉండగా.. హైదరాబాద్ లో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా జరుపుకుంటారు.

Read more: Snake Crawling: నిద్రలో ఉన్న యువతిపై దూసుకొచ్చిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు..

ముఖ్యంగా ఖైరతాబాద్, బాలాపూర్ వంటి, చార్మినార్ ,బడి చౌడీ వంటి అనేక ప్రాంతాలలో భారీ వినాయకులను ప్రతిష్టిస్తారు. అంతేకాకుండా..పదకొండు రోజులపాటు గణపయ్యకు భక్తితో పూజలు చేసి,నైవేద్యాలు సమర్పిస్తారు. చిన్న, పెద్దా తేడాలేకుండా గణపయ్య ఉత్సవంలో ప్రతి ఒక్కరు కూడా వినాయక నవరాత్రి ఉత్సవాలలో ఫుల్ జోష్ గా పాల్గొంటారు. వినాయక నవరాత్రుల్లో చాలా మంది హైదరాబాద్ లోని ఖైరతాబాద్ మహాగణపతికి చూడటానికి తప్పకుండా వస్తారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News