/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

Food Delivery Boy: డెలివరీ బాయ్‌గా పని చేస్తున్న ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి వెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. బ్రెయిన్‌ డెడ్‌ అయిన ఆ యువకుడి అవయవాలను కుటుంబసభ్యులు దానం చేయడంతో అవసరమైన వారికి అవయవాలు అమర్చారు. దీంతో నలుగురికి డెలివరీ బాయ్‌ వలన పునర్జన్మ లభించినట్టయ్యింది. ఈ సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. కన్నీళ్లు.. స్ఫూర్తి నింపే ఈ కథ ఏమిటో తెలుసుకోండి.

Also Read: Counting Date: ఎన్నికల సంఘం పొరపాటా? దిద్దుబాటా..? ఓట్ల లెక్కింపు తేదీ మార్పు

 

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని వట్టినాగులపల్లికి చెందిన బిస్వాల్‌ ప్రభాస్‌ (19) చదువుకుంటూ ఖాళీ సమయాల్లో డెలివరీ బాయ్‌గా పని చేసేవాడు. ఓ ప్రముఖ డెలివరీ సంస్థలో పార్ట్‌టైమ్‌గా డెలివరీలు చేస్తుండేవాడు. మార్చి 14వ తేదీన ఇలాగే డెలివరీలు చేయడానికి బైక్‌పై వెళ్తుండగా ఆటో ఢీకొట్టింది. వేగంగా ఢీకొట్టడంతో బిస్వాల్‌ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు, కుటుంబసభ్యులు వెంటనే కాంటినెంటల్‌ ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలో ఉంచి వైద్యం అందిస్తుంటే అతడి శరీరం స్పందించడం లేదు.

Also Read: Petrol Diesel Prices: వాహనదారులకు మోదీ సర్కార్‌ గుడ్‌న్యూస్‌.. తగ్గిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

ప్రభాస్‌ బ్రెయిన్‌ డెడ్‌ అయ్యాడని వైద్యులు నిర్ధారించారు. దీంతో కుటుంబసభ్యులు తీవ్రంగా విలపించారు. అయితే వైద్యులు కుటుంబసభ్యులను ఓదార్చారు. బ్రెయిన్‌ డెడ్‌ అయిన మీ కుమారుడి అవయవాలను దానం చేయాలని ప్రభాస్‌ తండ్రి బిస్వాల్‌ ప్రభాకర్‌, తల్లి పింకీని వైద్యులు కోరారు. వారికి నచ్చజెప్పి అవయవదానం వలన కలిగే ప్రయోజనాలను వివరించారు. చాలాసేపు కౌన్సెలింగ్‌ ఇవ్వడంతో చివరికి కుటుంబసభ్యులు అవయవదానానికి అంగీకరించారు. 

వెంటనే జీవన్‌ధాన్‌ బృందం బిస్వాల్‌ ప్రభాస్‌ కాలేయం, రెండు కిడ్నీలు సేకరించి అవసరమైన బాధితులకు వాటిని అమర్చారు. విజయవంతంగా అవయవ మార్పిడి చికిత్స అందించారు. కాలేయం దెబ్బతిని కొనప్రాణంతో ఉన్న ఓ ప్రాణానికి బిస్వాల్‌ ప్రభాస్‌ వలన మళ్లీ జన్మ లభించిందని కాంటినెంటల్‌ ఆస్పత్రి వైద్యుడు డాక్టర్‌ సెంథిల్‌ కుమార్‌ వెల్లడించారు. అవయవదానం చేసి బిస్వాల్‌ ప్రభాస్‌కు ఆస్పత్రి వైద్య సిబ్బంది కూడా నివాళులర్పించింది. బ్రెయిన్‌ డెడ్‌ అయిన వ్యక్తుల అవయవాలు మారిస్తే కొందరికి పునర్జన్మ లభిస్తుందని తెలిపారు. ప్రజలందరూ అవయవదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. బిస్వాల్‌ ప్రభాస్‌ వలన ముగ్గురికి కొత్త జీవితం ప్రారంభమైందని హర్షం వ్యక్తం చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Section: 
English Title: 
Hyderabad Food Delivery Boy Donated Organs In Jeevandhan Scheme Rv
News Source: 
Home Title: 

Organ Donation: చనిపోతూ ముగ్గురికి పునర్జన్మ ప్రసాదించిన ఫుడ్ డెలివరీ బాయ్‌

Organ Donation: చనిపోతూ ముగ్గురికి పునర్జన్మ ప్రసాదించిన ఫుడ్ డెలివరీ బాయ్‌
Caption: 
Hyderabad Food Delivery Boy Organ Donation (Source: File)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Organ Donation: చనిపోతూ ముగ్గురికి పునర్జన్మ ప్రసాదించిన ఫుడ్ డెలివరీ బాయ్‌
Ravi Kumar Sargam
Publish Later: 
No
Publish At: 
Monday, March 18, 2024 - 21:50
Created By: 
Ravi Kumar Sargam
Updated By: 
Ravi Kumar Sargam
Published By: 
Ravi Kumar Sargam
Request Count: 
23
Is Breaking News: 
No
Word Count: 
268