హైదరాబాద్: గత వారం రోజులుగా భానుడి భగ భగతో మండిపోయిన తెలంగాణలో వాతవరణం ఒక్కసారిగా చల్లబడింది. సూర్యుడు ప్రతాపం చూపించడంతో ఉక్కపోత, ఎండతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం నుంచి వాతావరణ చల్లబడటంతో ఉక్కపోత నుంచి కాస్త ఉపశమనం కలిగింది. ఆదివారం మధ్యాహ్నం నగరంతోపాటు, శివార్లలోని పలు ప్రాంతాల్లో (Heavy Rain) భారీ వర్షం కురుస్తోంది.
Also Read: రూ. 5 వేల కోట్లివ్వండి..!!
అంతేకాకుండా వచ్చే మూడు నాలుగు రోజులు ఈదురు గాలులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పంజాగుట్ట, ఖైరతాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మెహదీపట్నంతోపాటు నగర శివార్లలోని హయత్‌నగర్, తుర్కయంజల్, అబ్దుల్లాపూర్‌మెట్, పెద్దఅంబర్‌పేట్, ఘట్‌కేసర్, మేడ్చల్, ఇబ్రహిపట్నం, రూరల్ ప్రాంతాల్లో (Rural Areas) భారీ వర్షం కురుస్తోంది. దీంతో గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ అప్రమత్తమయ్యింది. మాన్‌సూన్ (disaster management) డిజాస్టర్ మేనేజిమెంట్ అత్యవసర బృందాలను జీహెచ్‌ఎంసీ (GHMC) సిద్ధం చేసింది. లోతట్టు, ప్రమాదకర ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..