Heavy Rains Alert: తెలంగాణలో ముూడ్రోజులు భారీ వర్షాల హెచ్చరిక, ఎక్కడంటే

Heavy Rains Alert: ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. రానున్న 24 గంటల్లో మరింతగా బలపడనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాల హెచ్చరిక జారీ అయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 14, 2023, 09:07 AM IST
Heavy Rains Alert: తెలంగాణలో  ముూడ్రోజులు భారీ వర్షాల హెచ్చరిక, ఎక్కడంటే

Heavy Rains Alert: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మేఘావృతమైంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రానున్న మూడ్రోజులు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ వెల్లడించింది.

బంగాళాఖాతంలో అల్పపీడనం రానున్న 24 గంటల్లో బలపడనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే గత మూడ్రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడీ అల్పపీడనం కారణంగా రానున్న మూడ్రోజులు భారీ వర్షాలు పడనున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడవచ్చు. ములుగు, నిజామాబాద్, జనగామ, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి.

ఇవాళ, రేపు, ఎల్లుండ ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఎల్లో ఎలర్ట్ జారీ అయింది. గ్రేటర్ హైదరాబాద్‌లోని పలు జిల్లాల్లో వచ్చే మూడ్రోజులు మోస్తరు వర్షాలు పడనున్నాయి. అల్పపీడనం రానున్న 24 గంటల్లో మరింతగా బలపడనుండటమే దీనికి కారణం. ఈ అల్పపీడనం దక్షిణ ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మీదుగా కదలవచ్చు. అటు హైదరాబాద్‌కు కూడా ఎల్లో అలర్ట్ జారీ కావడంతో మోస్తరు వర్షాలు పడనున్నాయని తెలుస్తోంది. 

అయితే కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో 19వ తేదీ వరకూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మాత్రం పడనున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. 

Also read: Eetala Rajender Demands For MSP: కేసీఆర్ ఇవ్వాల్సింది రైతు బందు కాదు.. ఈటల ఫైర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News