Heavy Rains Alert: ఏపీ , తెలంగాణ రాష్ట్రాల్లో ఇవాళ్టి నుంచి మూడ్రోజులపాటు విస్తారంగా వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా పడే అవకాశాలున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణమే దీనికి కారణంగా తెలుస్తోంది.
వాయువ బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆవర్తన ప్రభావంతో వాయువ్య బంగాళాఖాతంలో ఓ అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్ప పీడనానికి అనుబంధంగా మరో ఆవర్తనం సముద్రమట్టం నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తులో దక్షిణ దిశవైపుకు ఉంది. ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రానున్న మూడ్రోజుల్లో ఉత్తర ఒరిస్సా, ఉత్తర ఛత్తీస్గడ్ వైపుకు వెళ్లవచ్చు. బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం మేఘాల తరలింపుకు కారణమౌతుంది. ఈ మేఘాలు అటు మహారాష్ట్రవైపుకూ విస్తరించి ఉన్నాయి. దట్టంగా వీచిన మేఘాల కారణంగా పరిస్థితి అనుకూలంగా మారుతోంది. గాలుల వేగం కూడా పెరిగింది. దట్టమైన మేఘాలకు బలమైన గాలులు తోడవడంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చు. అటు ఉత్తర తెలంగాణ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీగా మేఘాలు ఏర్పడే అవకాశాలున్నాయి.
ఏపీలో విజయవాడ, పాలకొల్లు, మచిలీపట్నం, ఏలూరు ప్రాంతాల్లో భారీ వర్షం పడవచ్చని తెలుస్తోంది. అదే సమయంలో తెలంగాణలోని వరంగల్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, హనుమకొండ ప్రాంతాల్లో సైతం మోస్తరు వర్షాలు రావచ్చు. ఇవాళ్టి నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఒక్క రాయలసీమ తప్ప మిగిలిన ప్రాంతాల్లో చిరు జల్లులు లేదా మోస్తరు వర్షాలు పడవచ్చు. రాత్రికి ఉత్తర తెలంగాణలో మోస్తరు వర్షాలు ప్రారంభం కావచ్చు.
Also read: CH Krishnarao Death: సీనియర్ జర్నలిస్టు కృష్ణారావు కన్నుమూత, సీఎం జగన్, కేసీఆర్‌ల సంతాపం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook