Telangana Rain ALERT: తెలంగాణపై వరుణుడి ప్రతాపం తగ్గడం లేదు. వరుసగా నాలుగోరోజు కుండపోత వానలు కురిశాయి. శనివారం ఉమ్మడి వరంగల్ జిల్లాపై పంజా విసరగా.. ఆదివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కుండపోతగా వర్షాలు కురిశాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు మంచిర్యాల జిల్లాలో భారీ వర్షపాతం నమోదైంది. మంచిర్యాల జిల్లా కొల్లూరులో అత్యధికంగా 189 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. ములుగు జిల్లావెంకటాపురంలో 180 మిల్లిమీటర్లు, నీల్వాయిలో 161, కొత్తపల్లిలో 153 మిల్లిమీటర్ల వర్షం కురవగా.. భద్రాదికొత్తగూడెం జిల్లా కర్కగూడెంలో 161మిల్లిమీటర్ల వర్షం కురిసింది. కొమురం భీమ్ జిల్లా బెజ్జూరులో 13, భూపాలపల్లిలో 11 సెంటిమీటర్ల వర్షం కురిసింది. భద్రాది కొత్తగూడెం జిల్లా పినపాకలో 12, ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లోనూ కుండపోతగా వర్షాలు కురిశాయి.
ఆదివారం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వర్షం కురుస్తూనే ఉంది. ఉత్తర తెలంగాణలో కుండపోత కురవగా.. హైదరాబాద్ సహా దక్షిణ తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. 10 ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షం కురవగా.. 56 ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. 426 ప్రాంతాల్లో 426 ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. నాలుగు రోజులుగా కురస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లోనూ దాదాపుగా అన్ని చెరువులు నిండి మత్తడి పోస్తున్నాయి. సాగునీటి ప్రాజెక్టులు నిండటంతో గేట్లు ఎత్తారు. పలు గ్రామాల్లో చెరువులకు గండ్లు పడటంతో వందల ఎకరాల్లో పంటలు ధ్వంసమయ్యాయి.
సోమవారం కూడా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎనిమది జిల్లాల్లో రెడ్ అలెర్ట్ కొనసాగుతోంది.మరో మూడు రోజులు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. జనాలు అత్యవసర పనులు ఉంటే తప్ప రోడ్లపైకి రావొద్దని హెచ్చరించారు.అటు గోదావరిలో నీటిమట్టం ప్రమాదకరంగా మారింది. భద్రాచలం దగ్గర 43 అడుగులు దాటడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. పోలవరం దగ్గర నీటిమట్టం అంతకంతకు పెరిగిపోతోంది.
Also read:Maharashtra: శివసేన ఎమ్మెల్యేలకు షోకాజ్ నోటీసులు..ఉద్దవ్ ఠాక్రేకు ఊరటనేనా..?
Also read:EPFO: పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త..త్వరలో ఒకేసారి పెన్షన్ జమ..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook