Hyderabad Rains: హైదరాబాద్ లో దంచి కొడుతున్న వర్షం.. బయటికి రావొద్దని పోలీసుల హెచ్చరిక

Hyderabad Rains: హైదరాబాద్ లో మళ్లీ వర్షం దంచి కొడుతోంది. ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురుస్తోంది. గత వారంలో నగర పరిధిలో భారీ వర్షాలు కురిశాయి. మధ్యలో నాలుగు రోజులు చినుకు పడలేదు. తాజాగా మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో  ఉదయం నుంచి ముసురు కమ్మేసింది.

Written by - Srisailam | Last Updated : Jul 22, 2022, 02:29 PM IST
  • హైదరాబాద్ లో భారీ వర్షం
  • రోడ్లపైకి భారీగా వరద నీరు
  • ట్రాఫిక్ పోలీసుల అలెర్ట్
Hyderabad Rains: హైదరాబాద్ లో దంచి కొడుతున్న వర్షం.. బయటికి రావొద్దని పోలీసుల హెచ్చరిక

Hyderabad Rains: హైదరాబాద్ లో మళ్లీ వర్షం దంచి కొడుతోంది. ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురుస్తోంది. గత వారంలో నగర పరిధిలో భారీ వర్షాలు కురిశాయి. మధ్యలో నాలుగు రోజులు చినుకు పడలేదు. తాజాగా మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో  ఉదయం నుంచి ముసురు కమ్మేసింది. నగరంలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అమీర్‌పేట్‌, ఎస్‌ఆర్‌ నగర్‌, ఖైరతాబాద్‌, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ లో కుండపోతగా వర్షం కురుస్తోంది. సిటి పరిధిలోని మిగిలిన ప్రాంతాల్లోనూ ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. 

ఇవాళ ఉదయం 9 గంటల నుంచి  మధ్యాహ్నం 2 గంటల వరకు కూకట్ పల్లి పరిధిలోని బాలానగర్ లో 65 మిల్లిమీటర్ల భారీ వర్షం కురిసింది. బాలాజీనగర్ లో 54, మూసాపేటలో 54, గాజులరామారంలో 51, చందానగర్ లో 50, హైదర్ నగర్ లో 50, జీడిమెట్లలో 50, మాదాపూర్ లో 40, మల్కాజ్ గిరి మౌలాలీలో 40 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. గ్రేటర్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో రెండు నుంచి మూడు సెంటిమీటర్ల వర్షం కురిసింది. 

భారీ వర్షంతో గ్రేటర్ పరిధిలో రోడ్లపైకి భారీగా వరద ప్రవహిస్తోంది. పలుచోట్ల రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమలం అయ్యాయియ దీంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామైంది.  ఉదయం స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు, కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు,  వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. షియర్‌ జోన్‌ ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం వరకు హైదరాబాద్‌ సహా ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.  భారీ వర్ష సూచనతో హైదరాబాద్ ప్రజలను ట్రాఫిక్‌ పోలీసులు అప్రమత్తం చేశారు. పలు సూచనలు చేశారు. భారీ వర్షాలు కురుస్తున్నందున రోడ్లపైకి రావొద్దని సూచించారు. అత్యవసర పనులు ఉంటే తప్ప ఎవరూ రోడ్లపైకి రావొద్దన్నారు. భారీ వర్షాలతో  వరద నీరు రోడ్లపైకి చేరిన నీరు బయటకు వెళ్లేందుకు గంటకు పైగా సమయం పడుతుందన్నారు. 

Also Read: Droupadi Murmu: బీజేపీ చాణక్యం ముందు విపక్ష కూటమి బోల్తా.. రాష్ట్రపతి ఎన్నికల్లో భారీగా క్రాస్ ఓటింగ్...

Also Read: India Presidents:ద్రౌపది ముర్ముకు 64 శాతం ఓట్లు... ఎక్కువ ఓట్లతో రాష్ట్రపతిగా గెలిచిందో ఎవరో తెలుసా?  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News