Gold Seized in hyderabad aiport: ఎంత నిఘా పెట్టినా గోల్డ్ స్మగ్లింగ్ ఆగడం లేదు. ఏదో ఒక విధంగా దేశంలోకి బంగారం అక్రమ రవాణా జరుగుతూనే ఉంటుంది. తాజాగా అలా పసిడిని తరలిస్తున్న కొంద మందిని అధికారులు పట్టుకున్నారు.
తాజాగా హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో (Shamshabad Airport) భారీగా బంగారం పట్టుబడింది. అనుమానం వచ్చిన ప్రయాణికులను తనిఖీ చేస్తుండగా 23 మంది వద్ద భారీగా బంగారం కస్టమ్స్ అధికారులకు చిక్కింది. వీళ్ల దగ్గర నుంచి సుమారు రూ.8 కోట్ల విలువ చేసే 14.906 కిలోల గోల్డ్ (Gold Seized)ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీరంతా సూడాన్ (Sudan) నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ కేసులో నలుగురు అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన వారిని విచారిస్తున్నారు.
చిక్కిన వారంతా షూ కింద ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుని గోల్డ్ ను తరలిస్తున్నట్లు అధికారుల విచారణలో తేలింది. మిగతా వారందరిని ఆరా తీసి పూర్తి వివరాలు వెల్లడిస్తామని కస్టమ్స్ అధికారులు తెలిపారు. అయితే దొరికిన వారందరూ ఒకే ముఠాకు చెందిన వారా లేక వేర్వేరా అనే కోణంతో నిందితులను విచారిస్తున్నారు అధికారులు. గతంలో కూడా శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఇలాంటి ఉదంతాలు చాలానే వెలుగు చుశాయి.
Also Read: Street Dogs Kills Boy: అంబర్ పేటలో విషాదం.. నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్కల దాడి! తీవ్ర గాయాలతో మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.