Hyderabad Gun Fire: హైదరాబాద్ లో కాల్పుల కలకలం.. ఒకరు మృతి.. ఆస్తి గొడవలే కారణం..

Hyderabad Gun Fire:  హైదరాబాద్ లో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. అర్ధరాత్రి తర్వాత కాల్పుల ఘటన జరిగింది. మాదాపూర్ నీరూస్ సర్కిల్లో తెల్లవారుజామున  మూడు గంటల 50 నిమిషాల సమయంలో కారులో వచ్చి నిలబడ్డ వ్యక్తిపై మరో వ్యక్తి కాల్పులు జరిపాడు.

Written by - Srisailam | Last Updated : Aug 1, 2022, 11:26 AM IST
  • హైదరాబాద్ లో కాల్పుల కలకలం
  • కాల్పుల్లో ఇస్మాయిల్ మృతి
  • ఆస్తి గొడవలే కారణం
Hyderabad Gun Fire: హైదరాబాద్ లో కాల్పుల కలకలం.. ఒకరు మృతి.. ఆస్తి గొడవలే కారణం..

Hyderabad Gun Fire:  హైదరాబాద్ లో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. అర్ధరాత్రి తర్వాత కాల్పుల ఘటన జరిగింది. మాదాపూర్ నీరూస్ సర్కిల్లో తెల్లవారుజామున  మూడు గంటల 50 నిమిషాల సమయంలో రోడ్డు పక్కన నిలబడ్డ వ్యక్తిపై మరో వ్యక్తి కాల్పులు జరిపాడు. కాల్పుల అనంతరం బైక్ పై  పరారయ్యాడు దుండగుడు. కాల్పుల్లో వ్యక్తికి తీవ్ర గాయలయ్యాయి. గాయపడిన వ్యక్తిని ఇస్మాయిల్ గా గుర్తించారు. అతడిని స్నేహితులు ఆసుపత్రికి తరలించారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన వ్యక్తి హాస్పిటల్ లో చనిపోయాడు. ఈ కాల్పుల ఘటనలో మరో వ్యక్తికి గాయలయ్యాయి. ఈ ఘటన హైదరాబాద్ లో సంచలనంగా మారింది. సమాచారం అందిన వెంటనే స్పాట్ కు చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. కాల్పులు జరిపిన దుండగుడి కోసం గాలిస్తున్నారు. కాల్పులు జరిపింది ముజీబ్ గా పోలీసులు గుర్తించారు. ఆస్తి గొడవలే కాల్పులకు కారణమని తెలుస్తోంది. మృతి చెందిన ఇస్మాయిల్ మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు.

ముజీబ్, ఇస్మాయిల్‌ ఒకే బైక్ పై వచ్చారు. మాదాపూర్ నీరూస్ వద్దకు రాగానే ఇద్దరి మధ్య మాటామాటా పెరిగినట్లు తెలుస్తోంది. దీంతో తీవ్ర ఆగ్రహంతో ముజీబ్ ఇస్మాయిల్ పై ఆరు రౌండ్ లు కాల్పులు జరపడంతో ఇస్మాయిల్ అక్కడికక్కడే చనిపోయాడు.
ఆస్తి గొడవలే కాల్పులకు దారితీసినట్లు తెలుస్తోంది. పాతబస్తీకి చెందిన ఇస్మాయిల్, మజీబ్లు ఇద్దరు రౌడీషీటర్లు. వీళ్లకు  జైలులో పరిచయం ఏర్పడింది. జైలు నుంచి బయటికి వచ్చాక ఇద్దరు కలిసి సెటిల్మెంట్ ల కోసం ముఠాగా ఏర్పడినట్లు సమాచారం. అయితే జహీరాబాద్ లోని మూడు ఎకరాల భూమి విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని అనుచరులు చెబుతున్నారు.

Also read:Revanth Reddy: మరో ప్రజా పోరాటానికి సిద్ధమవుతున్న కాంగ్రెస్‌..త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు..!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News