Telangana Teachers: తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయులకు తీపి కబురు వినిపించింది. కొన్నాళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. సార్వత్రిక ఎన్నిల నియమావళి ఎత్తివేసిన మరుసటి రోజే ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది. ఈ సందర్భంగా కొన్ని నియమ నిబంధనలు సూచించింది.
Also Read: King Cobra: హైదరాబాద్ రోడ్లపై తాచుపాము హల్‌చల్.. భారీగా ట్రాఫిక్ జామ్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి దాదాపు ఆరు నెలలు అవుతోంది. మొదటి మూడు నెలలు ప్రభుత్వ పాలనను సర్దుకోవడంతోనే గడిచిపోగా.. మరో మూడు నెలలు ఎన్నికలతో కాలం గడిచిపోయింది. దీంతో ఉపాధ్యాయుల బదిలీ, పదోన్నతులు చేపట్టలేదు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో పెండింగ్‌లో ఉన్న ఈ అంశాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందర వేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల కోడ్ ఎత్తివేసిన మరుసటి రోజే అంటే శుక్రవారం ఉపాధ్యాయుల బదిలీ, పదోన్నతులకు సంబంధించి ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది. షెడ్యూల్ విడుదల చేస్తూనే కొన్ని మార్గదర్శకాలు ఉత్తర్వుల్లో పేర్కొంది.
Also Read: Water Supply Cut: హైదరాబాద్ ప్రజలకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు నీటి సరఫరా బంద్
బదిలీలు, పదోన్నతులకు సంబంధించి శనివారం జూన్ 8వ తేదీ నుంచి ప్రక్రియ ప్రారంభం కానుంది. మల్టీ జోన్ 1, 2లో వివిధ తేదీల్లో బదిలీలు, పదోన్నతులు జరగనున్నాయి.
మల్టీ జోన్ 1: ఈ నెల 8 నుంచి 22వ తేదీ వరకు (మొత్తం 15 రోజులు) బదిలీలు, పదోన్నతులు
మల్టీ జోన్ 2: ఈ నెల 8 నుంచి 30 వ తేదీ వరకు (మొత్తం 23 రోజులు) బదిలీలు, పదోన్నతులు
మార్గదర్శకాలు
- పదవీ విరమణకు 3 సంవత్సరాల లోపు ఉన్న వారికి తప్పనిసరి బదిలీ నుంచి మినహాయింపు
- పండిట్, పీఈటీల అప్డేడేషన్
- మల్టీ జోన్ 2లో ప్రధానోపాధ్యాయుల పదోన్నతి, మల్టీ జోన్ 1లో స్కూల్ అసిస్టెంట్ పదోన్నతితో షెడ్యూల్ ప్రారంభం
- కోర్ట్ కేసులతో ఎక్కడ ఆగిందో ఆ ప్రక్రియ నుంచి మళ్లీ ప్రారంభం
- టెట్‌తో సంబంధం లేకుండానే పదోన్నతులు కల్పిస్తుండడం విశేషం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter