Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లో ఎక్స్‌ట్రా ట్రైన్

Nagole to Raidurg Metro Route: గోల్ నుంచి రాయదుర్గం వరకు ఉదయం సాయంత్రం వేళల్లో ఎక్స్ ట్రా ట్రైన్ ఏర్పాటు చేస్తామని హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి తెలిపారు. ఈ రూట్‌లో భారీగా రద్దీ ఉంటున్న నేపథ్యంలో అదనపు ట్రైన్‌తో ప్రయాణికులకు కాస్త ఊరట లభించే అవకాశం ఉంటుంది.  

Written by - Ashok Krindinti | Last Updated : Nov 5, 2024, 03:27 PM IST
Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లో ఎక్స్‌ట్రా ట్రైన్

Nagole to Raidurg Metro Route: హైదరాబాద్ మెట్రోకు భారీ డిమాండ్ నెలకొంది. ముఖ్యంగా రాయదుర్గం వైపు వెళ్లే రూట్‌లో ఉదయం, సాయంత్రం నిలబడేందుకు కూడా స్థలం ఉండదు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి గుడ్‌న్యూస్ చెప్పారు. నాగోల్ నుంచి రాయదుర్గం వరకు ఉదయం సాయంత్రం వేళల్లో ఉన్న రద్దీని దృష్టిలో పెట్టుకొని అదనపు రైలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. డిజిటల్ వ్యాలెట్ యాప్‌తో మొబైల్ ద్వారా ప్రయాణికులు టికెట్లు కొనుగోలు చేసి మెట్రోలో ప్రయాణించవచ్చని చెప్పారు. కౌంటర్లో రద్దీని తగ్గించేందుకు మొబైల్ వ్యాలెట్ ఉపయోగపడుతుందని అన్నారు. కస్టమర్లకు మెట్రో సేవలు మరింత చేరువచేసేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుందని చెప్పారు. గత ఏడు సంవత్సరాలుగా మెట్రో ఎలాంటి అభివృద్ధి చెందలేదని సీఎం చెబుతున్నారని అన్నారు.

Also Read: Pawan Kalyan : పవన్‌కు ఏదైనా ప్రమాదం పొంచి ఉందా..? అందుకే హోంశాఖ కావాలంటున్నారా..?

"హైదరాబాద్ మెట్రో 64 కి.మీ దూరంతో దేశంలో రెండో స్థానంలో ఉండేది. ప్రస్తుతం 9 స్థానానికి పడిపోయాం.. మెట్రో విస్తరణ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి సీరియస్‌గా ఉన్నారు. హైదరాబాద్ నగరంలో ఉన్న మూడు కారిడార్లలో మియాపూర్ నుంచి పటాన్‌చెరు వరకు నాగోల్ నుంచి రాయదుర్గం అక్కడి నుంచి కోకోపేట్ వరకు, ఎయిర్ పోర్టు వరకు నిర్మించే మెట్రో అన్ని స్టేషన్లకు అనుసంధానం చేస్తాం. నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వెళ్లేందుకు చాంద్రాయణగుట్ట నుంచి ఎయిర్‌పోర్ట్‌కు కనెక్టివిటీ. ఆరాంఘర్ నుంచి బెంగళూరు హైవేకి అక్కడి నుంచి కొత్త హైకోర్టుకు వరకు మెట్రో విస్తరిస్తాం.

అన్ని కారిడార్లను కలుపుతూ ఎయిర్‌పోర్ట్‌కు మెట్రో నిర్మిస్తాం. నాగోల్ నుంచి ఎల్బీనగర్ ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట ఓవైసీ ఆసుపత్రి మీదుగా హైకోర్టు వరకు 36 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎయిర్ పోర్టుకు కనెక్టివిటీ మెట్రోరైలు నిర్మిస్తాం. 76.4 కి మీ పొడవునా 24 వేల  2269 కోట్లు వ్యయంతో మెట్రో విస్తరిస్తాం. భవిష్యత్తులో రెండు మూడు స్థానాల్లో హైదరాబాద్ ఉండేందుకు కృషి చేస్తాం.  

మెట్రో రైళ్లల్లో కొన్నిసార్లు సాంకేతిక సమస్యలు వస్తుంటాయి. మీడియాలో దీన్ని అనవసరంగా ఎక్కువ హైలైట్ చేస్తున్నారు. ఢిల్లీ నుంచి కూడా ఫోన్లు చేసి నన్ను  అడుగుతున్నారు. ఇది అంత పెద్ద సమస్య కాదు. మెట్రోలలో హైదరాబాద్ మెట్రో ఒకటి. 2010లో బిడ్ ప్రాసెస్‌కు వెళ్లాము. ఈ రోజు ఫలితం చూస్తున్నాం. ముఖ్యమంత్రి మెట్రో రెండవ దశపై ప్రత్యేక దృష్టిసారించారు. ఆన్‌లైన్ పేమెంట్స్‌లో భారత్ ముందుంది." అని మెట్రో ఎండీ తెలిపారు.

Also read: 8th Pay Commission Announcement: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అద్దిరిపోయే వార్త, భారీగా పెరగనున్న జీతాలు, ఎప్పుడంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News