హైదరాబాద్‌లో గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌కి తప్పిన ప్రమాదం

హైదరాబాద్‌లో గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌కి పెను ప్రమాదం తప్పింది. సికింద్రాబాద్ నుండి గుంటూరుకి వెళ్లే ఈ రైలు..     కేససముద్రం చేరుకోగానే ఇంజిన్ వెనుక బోగికి ఆనుకొని ఉండే బ్రేక్ రాడ్ తెగిపోవడంతో ఒక కిలోమీటర్ పాటు అలాగే ప్రయాణిస్తూ వెళ్లింది. 

Last Updated : Sep 24, 2018, 10:17 PM IST
హైదరాబాద్‌లో గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌కి తప్పిన ప్రమాదం

హైదరాబాద్‌లో గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌కి పెను ప్రమాదం తప్పింది. సికింద్రాబాద్ నుండి గుంటూరుకి వెళ్లే ఈ రైలు..     కేససముద్రం చేరుకోగానే ఇంజిన్ వెనుక బోగికి ఆనుకొని ఉండే బ్రేక్ రాడ్ తెగిపోవడంతో ఒక కిలోమీటర్ పాటు అలాగే ప్రయాణిస్తూ వెళ్లింది. సిబ్బంది ఎవరూ కూడా ఈ విషయాన్ని గమనించలేదు. కానీ.. అధికారులకి బయట నుండి ఈ విషయానికి సంబంధించిన సమాచారం అందగానే.. వారు కష్టపడి మరీ ఈ రైలును ఆపించాల్సి వచ్చింది. తర్వాత రైలును నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఈ ఘటన పై నివేదిక ఇవ్వాల్సిందిగా సిబ్బందిని స్థానిక రైల్వే జోన్ అధికారులు ఆదేశించారు. 17201/17202 సంఖ్యలతో నడిచే గోల్కొండ ఎక్స్ ప్రెస్.. భారతీయ రైల్వేలకు చెందిన దక్షిణ మధ్య రైల్వే డివిజన్‌కు చెందినది. ఈ ఇంటర్ సిటీ రైలు భారతదేశంలోనే అతి వేగంగా ఆవిరితో నడిచే రైలుగా కూడా రికార్డుల్లో కెక్కింది. సికింద్రాబాద్, మౌలాలీ, జనగాం, కాజీపేట, వరంగల్ మీదుగా కేసముద్రం వెళ్లే ఈ రైలు.. ఆ తర్వాత ఖమ్మం, కొండపల్లి, విజయవాడ, మంగళగిరి మీదుగా గుంటూరు చేరుకుంటుంది. 

ఈ మధ్యకాలంలో తెలంగాణలో రైలు ప్రమాదాలకు సంబంధించిన ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. వారం రోజుల క్రితమే జనగామ జిల్లా కేంద్రం రైల్వేస్టేషన్‌ వ్యాగన్‌ పాయింట్‌ లైన్‌పై గూడ్స్‌రైలు పట్టాలు తప్పింది. బోగీలు పట్టాలు తప్పి పెద్ద పెద్ద శబ్దాలు రావడంతో గార్డు అప్రమత్తమవ్వగా పెనుప్రమాదం తప్పింది. వెంటనే సిబ్బంది బ్రేక్‌ అప్లై చేసి సమయస్ఫూర్తిని పాటించడంతో గూడ్స్‌రైలు అక్కడే ఆగింది. అప్పటికే మూడు బోగీలు పట్టాలు తప్పి దూసుకుపోవడంతో పట్టాలకు మధ్యలో ఉండే కాంక్రీట్‌ స్లీపర్‌లు విరిగిపోయాయి. ఈ ఘటనను మరిచిపోక ముందే మళ్లీ తెలంగాణలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

Trending News