Kishan Reddy About TRS | గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మాటల యుద్ధం వాడి వేడిగా సాగుతోంది. పార్టీ నేతలు కీలక వ్యాఖ్యాలు చేసి ప్రజల నమ్మకాన్ని గెలిచే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి , బీజేపి సీరియర్ నేత కిషన్ రెడ్డి తెరాస పార్టీపై విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఇచ్చిన మాటను నిలబట్టుకోలేదు అని విమర్శించారు కిషన్ రెడ్డి.
Also Read | Prabhu Deva: ముంబైలో ప్రభుదేవ రెండో పెళ్లి ?.. ఎవరినో తెలుసా?
గ్రేటర్ ఎన్నికల్లో ( GHMC Elections 2020 ) తమ పార్టీకి ఓటు వేయమని ప్రజల వద్దకు వస్తున్న తెరాస నేతలను ప్రజలు నిలదీయాలన్నారు కిషన్ రెడ్డి. భాగ్యనగరాన్ని డల్లాస్, ఇస్తాంబుల్ చేస్తాం అని వారిచ్చిన హామీలు ఏమయ్యాయి అని ? ఇక డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల హామీ ఏమైంది అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ చెప్పిన విధంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తారేమో అనే ఆశతో ప్రజలు ఓటు వేశారు అని .. వారికి ఎన్ని ఇళ్లు ఇచ్చారు అని ప్రశ్నించారు .
Also Read | Prabhu Deva: ముంబైలో ప్రభుదేవ రెండో పెళ్లి ?.. ఎవరినో తెలుసా?
తెరాస పార్టీ గతంలో రహాదారిపై గుంతలు చూపిస్తే రూ. వెయ్యి ఇస్తామని ఛాలెంజ్ చేసింది అని.. అయితే గుంతల్లేని రోడ్డు చూపిస్తే తను రూ. లక్ష ఇస్తామన్నారు కిషన్ రెడ్డి ( Kishan Reddy ). మరోవైపు హైదరాబాద్ నగరం సముద్రంలా మారడానికి తెరాస కారణం కాదా అని ప్రశ్నించారు. భాగ్యనగరంలో వరదల వల్ల మొత్తం15 లక్షల మంది నిరాశ్రయులు అయ్యారు అన్నారు. మరోవైపు ప్రజలకు బీజేపీపై నమ్మకం మరింతగా పెరిగింది అని.. రేపటి నుంచి ప్రచారం ప్రారంభిస్తాం అన్నారు.
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR