మెట్రోస్టేషన్లలోనూ కూరగాయలు కొనుక్కోవచ్చు

ఇప్పటికే నగరమంతా 'మన కూరగాయలు' పేరుతో కూరగాయలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన మార్కెటింగ్‌ శాఖ.. ఇదే విధానాన్ని మెట్రోస్టేషన్లలో అందుబాటులోకి తెస్తున్నది.

Last Updated : May 20, 2018, 09:50 AM IST
మెట్రోస్టేషన్లలోనూ కూరగాయలు కొనుక్కోవచ్చు

హైదరాబాద్‌లో మెట్రో రైల్వే స్టేషన్ల వద్ద ప్రయాణీకుల కోసం నిత్యావసర వస్తువులతో పాటు కూరగాయలను అందుబాటులో ఉంచేలా తెలంగాణ మార్కెటింగ్ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ప్రయాణం ముగిసిన తర్వాత ఇళ్లకు వెళ్తూ ప్రయాణీకులు కూరగాయలు తీసుకెళ్లేలా ఉదయం 5 నుంచి రాత్రి 12 వరకు వీటిని అందుబాటులో ఉంచనుంది. ముందుగా 11 రైల్వే స్టేషన్లలో ఈ సౌకర్యాన్ని ఏర్పాటు చేసి దశలవారీగా మిగితా స్టేషన్లకు విస్తరించనుంది.

ఇప్పటికే నగరమంతా 'మన కూరగాయలు' పేరుతో కూరగాయలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన మార్కెటింగ్‌ శాఖ.. ఇదే విధానాన్ని మెట్రోస్టేషన్లలో అందుబాటులోకి తెస్తున్నది. కూరగాయల సాగు చేస్తున్న రైతులను ప్రోత్సహించాలనే ఉద్ధేశ్యంతో ప్రభుత్వం మన కూరగాయలు అనే పథకానికి శ్రీకారం చుట్టింది. ఇప్పుడు ఈ పథకం మెట్రో ప్రయాణికులకూ వరంగా మారనుంది. మెట్రోస్టేషన్లతో పాటు త్వరలో ప్రారంభంకాబోతున్న అమీర్‌పేట -హైటెక్‌సిటీ, అమీర్‌పేట-ఎల్బీనగర్ కారిడార్లకు కూడా కూరగాయల పథకాన్ని విస్తరిస్తున్నారు.

Trending News