ED investigation of MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ చేస్తారనే ఊహగానాలకు చెక్ పడింది. దాదాపు 9 గంటలపాటు ఆమెను ఈడీ అధికారులు విచారించగా.. అనంతరం కవిత కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. ఈడీ ఆఫీస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. అక్కడి నుంచి కారులో కేసీఆర్ ఇంటికి వెళ్లిపోయారు. ఐదుగురు అధికారులతో కూడిన బృందం కవితను విచారించింది. రామచంద్ర పిళ్లై, కవితను ఎదురెదురుగా కూర్చోబెట్టి ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. పీఎంఎల్ఏ సెక్షన్ 50 కింద కవిత స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. ఈ నెల 16న ఈడీ విచారణకు మరోసారి కవిత హాజరుకానున్నారు.
విచారణ అనంతరం కవిత చిరునవ్వుతో బయటటకు వచ్చారు. శనివారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన విచారణ.. ఈడీ విచారణ రాత్రి 8 గంటల వరకు కొనసాగింది. 9 గంటలపాటు అనేక ప్రశ్నలకు సమాధానాలు రాబట్టినట్లు తెలుస్తోంది. సాయంత్రం 6 గంటలకే ఈడీ విచారణ ముగియాల్సి ఉండగా.. 8 గంటల వరకు సాగింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన అరుణ్ రామచంద్రన్ పిళ్లైను విచారణ సందర్భంగా పిలిపించినట్లు తెలుస్తోంది. కవిత ఎదురుగా ఆయనను కూర్చొబెట్టి.. ఒకేసారి ఇద్దరిని ప్రశ్నించినట్లు సమాచారం. గతంలో కవిత లేని సమయంలో రామచంద్రన్ పిళ్లై ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా కీలక సమాచారం రాబట్టినట్లు ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను ఈడీ అరెస్ట్ చేసింది. ఆయన అరెస్ట్ తరువాత కవిత విచారణ ఉండడంతో ఆమె అరెస్ట్ కూడా తప్పదని ప్రచారం జోరుగా సాగింది. ఉదయం నుంచి ఢిల్లీ ఈడీ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ నేతలు భారీగా చేరుకున్నారు. సాయంత్రం భారీగా పోలీసులను మోహరించి అక్కడి నుంచి వారిని ఖాళీ చేయించారు. విచారణ ముగిసిన కవిత బయటకు రావడంతో బీఆర్ఎస్ శ్రేణులు రిలాక్స్ అయ్యాయి. అయితే 16న మరోసారి విచారణకు హాజరుకానున్న నేపథ్యంలో ఆ రోజే అరెస్ట్ చేస్తారని మరో ప్రచారం తెరపైకి వచ్చింది.
Also Read: India Vs Australia: అహ్మదాబాద్ టెస్టులో భారత్ జోరు.. ఆసీస్‌కు దీటుగా..
Also Read: Shubman Gill: శుభ్‌మన్ గిల్ సెంచరీ.. కేఎల్ రాహుల్ సర్దుకోవాల్సిందేనా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook