/telugu/photo-gallery/tspsc-group-4-final-result-2024-category-wise-selected-candidates-list-check-full-details-here-rn-180895 TSPSC: తెలంగాణ గ్రూప్‌ 4 పరీక్షలో కేటగిరీలవారీగా పాసైన అభ్యర్థులు.. ఆరోజే నియామక పత్రాలు జారీ.. TSPSC: తెలంగాణ గ్రూప్‌ 4 పరీక్షలో కేటగిరీలవారీగా పాసైన అభ్యర్థులు.. ఆరోజే నియామక పత్రాలు జారీ.. 180895

MLC Election Counting: తెలంగాణలో జరిగిన ఓ కీలక ఎన్నికకు సంబంధించిన ఓట్ల లెక్కింపును ఎన్నికల సంఘం వాయిదా వేసింది. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుండడంతో ఆ ఓట్ల లెక్కింపు చేపడితే ఓటర్లపై ప్రభావం చూపుతుందనే ఉద్దేశంతో ఎన్నికల సంఘం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఓట్ల లెక్కింపును రెండు నెలలకు వాయిదా వేస్తూ కీలక ప్రకటన చేసింది. 

Also Read: Harish Rao: రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఇవ్వాలో రేపో ఎప్పుడూ కూలుతుందో..? హరీశ్ రావు సందేహం

 

బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణ రెడ్డి కాంగ్రెస్‌ తరఫున కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాజ్యాంగం ప్రకారం ఒక చట్టసభలోనే కొనసాగాల్సి ఉండడంతో నారాయణ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. మార్చి 28వ తేదీన ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఓట్లు వేశారు. స్థానిక సంస్థల్లో సభ్యులైన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్‌ కౌన్సిలర్లు ఈ ఉప ఎన్నికలో ఓటు వేశారు. ఈ ఓట్ల లెక్కింపును ఈనెల 2వ తేదీన చేపట్టాల్సి ఉంది.  రేపు (మంగళవారం) జరగాల్సిన ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ వాయిదా వేయాలంటూ ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు ఇచ్చింది. 

Also Read: KTR Vs Kishan Reddy: గాలికి గెలిచిన కిషన్‌ రెడ్డికి ఈసారి ఓటమే.. ఇదే నా ఛాలెంజ్‌: కేటీఆర్‌

ఎందుకంటే..?

ప్రస్తుతం రాష్ట్రంలో, దేశంలో పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లోంది. ఈ నేపథ్యంలో కౌంటింగ్ చేయవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు పార్లమెంట్ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉండడంతో ఓట్ల లెక్కింపును విధిలేక వాయిదా వేయాల్సి వచ్చింది. తిరిగి జూన్ 2వ తేదీన ఎన్నికల కౌంటింగ్ జరపాలని ఆదేశించింది. పార్లమెంట్ ఎన్నికల ఓటింగ్ పూర్తయిన తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ చేసుకోవాలంటూ ఆదేశాలు ఇచ్చింది. బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్‌.నవీన్‌ కుమార్‌ రెడ్డి పోటీ చేశారు. అతడికే గెలుపు అవకాశాలు మెండుగా ఉండడంతో అధికార కాంగ్రెస్‌ పార్టీ విజ్ఞప్తి మేరకు ఈ ఓట్ల లెక్కింపు వాయిదా వేసినట్లు చర్చ జరుగుతోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

FacebookTwitterసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Section: 
English Title: 
Election Commission Postpones Mahabubnagar Local Authorities MLC Election Counting To June 2nd Rv
News Source: 
Home Title: 

MLC Election Counting: రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం భారీ షాక్‌.. ఓట్ల లెక్కింపు వాయిదా

MLC ByPoll Counting: రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం భారీ షాక్‌.. ఓట్ల లెక్కింపు వాయిదా
Caption: 
Mahabubnagar Local Authorities MLC Election Counting Postpone (Source: File)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
MLC ByPoll Counting: రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం షాక్‌.. ఓట్ల లెక్కింపు వాయిదా
Ravi Kumar Sargam
Publish Later: 
No
Publish At: 
Monday, April 1, 2024 - 17:05
Created By: 
Ravi Kumar Sargam
Updated By: 
Krindinti Ashok
Published By: 
Ravi Kumar Sargam
Request Count: 
21
Is Breaking News: 
No
Word Count: 
254